The South9
The news is by your side.
after image

నిరుద్యోగ యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి : ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి.

post top

*నిరుద్యోగ యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి : ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*

 

*రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా కృషి చేస్తూ స్కిల్ డెవలప్ మెంట్, శిక్షణా సంస్థ ద్వారా ఆత్మకూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 24వ తేది నిర్వహించే జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు.*

 

Post Inner vinod found

*శుక్రవారం నెల్లూరులోని మేకపాటి క్యాంపు కార్యాలయంలో స్కిల్ డెవలప్ మెంట్ అధికారులతో కలసి జాబ్ మేళా పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గంలో 18 నుండి 30 సంవత్సరాలలోపు నిరుద్యోగ యువతి యువకుల కోసం 15 కంపెనీల ద్వారా 1300 పైచిలుకు ఉద్యోగ అవకాశాలు ఈ జాబ్ మేళా ద్వారా కల్పిస్తున్నట్లు తెలిపారు.*

 

*ఈ నెల 24వ తేది ఉదయం 9 గంటల నుండి నిర్వహించే ఈ జాబ్ మేళాకు ప్రఖ్యాత కంపెనీలు పాల్గొంటున్నాయని, 10వ తరగతి నుండి ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, బిటెక్ చదివిన నిరుద్యోగ యువతి యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.*

 

*ఎమ్మెల్యే వెంట జిల్లా స్కిల్ డెవలప్ మెంట్ అధికారి వీనిల్ కుమార్, డీఆర్ డీఏ జిల్లా జాబ్ మేనేజర్ హైమావతి, ప్లెస్ మెంట్ ఎగ్జిక్యూటివ్ జనార్థన్ తదితరులు ఉన్నారు.*

Post midle

Comments are closed.