అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో పదవ తరగతి పరీక్షల నిర్వహణ వ్యవహారంలో లోకేష్ తలదూర్చడం తో ఆ వ్యవహారానికి రాజకీయ రంగు పులుముకుంది. ఎలాగూ టెన్త్ పరీక్షలు వాయిదా వేయాలని కునే సమయానికి లోకేష్ ఎంట్రీ ఇవ్వడంతో సీన్ మారింది. ఇది గతం . ఆ వ్యవహారం హైకోర్టుకు చేరడంతో అప్పట్లో ప్రభుత్వం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జులై 26 నుంచి ఆగస్టు 2 వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. దీనికి సంబంధించి విద్యా శాఖ కమిషనర్ చిన భద్రుడు నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనిపై ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా చివరి నిమిషంలో ప్రభుత్వం పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ ఉదృతంగా ఉన్నందున పరీక్షలు రద్దు చేయాలని సుప్రీం లో దాఖలైన పిటిషన్ ని విచారించి ఈరోజు నాలుగు రాష్ట్రాల కి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నేపధ్యంలో ప్రభుత్వం వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ ఉద్ధృతి తగ్గు ముఖం పడుతున్న సమయంలో ముందుకు వెళతారా లేదా అనేది మరికొన్ని రోజుల్లోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Comments are closed.