The South9
The news is by your side.
after image

రీల్ హీరో కాదు రియల్ హీరో, రియల్ స్టార్ శ్రీహరి.

మహేష్ బాబు హీరోగా నటించిన శ్రీమంతుడు చిత్రంలోని  కదలాంటి నిజం..  ఈ స్టోరీ….

 

తెలంగాణా లోని ఒక మారుమూల పల్లెటూర్లో షూటింగ్…. హీరో ఓ రెండు రోజుల పాటు అక్కడే ఉండాలి కాల్షీట్లు సర్దుబాటు కాలేదు, చాలా టైట్ షెడ్యూల్, ఇక్కడ పూర్తి చేసుకుని వెళ్తేనే, మిగతా సినిమాలకు ఏ ఇబ్బందీ ఉండదు, పైగా తరువాత చేసేవన్నీ పెద్ద హీరోల సినిమాలే…

 

ఆ ఊరి పెద్దమనిషి విషయం తెలుసుకుని ఆ సినిమా యూనిట్ వాళ్లకు ఆతిథ్యం ఇచ్చాడు, పేరుకే పెద్ద మనిషి, బ్రతుకు చాలా బీద పరిస్థితి, ఆఊర్లో ఆరాత్రి కరెంట్ ఓ గంటసేపు మాత్రమే ఉంది, నీళ్ళ కోసం జనాలు కిలోమీటర్ల కొద్దీ నడుచుకుంటూ వెళ్ళి తెచ్చుకోవాల్సిందే…

 

తెల్లారింది ఆ సదరు హీరోకి ఆ ఊరి పరిస్థితులు ఏమాత్రం నచ్చడం లేదు, షూటింగ్ లో పాల్గొంటున్నాడు కానీ చాలా అసహనానికి గురవుతున్నాడు, పాపం మరేం చేస్తాడు గురూజీ స్టార్ హోటల్లో ఉండాల్సిన హీరో, తాగడానికి మినరల్ వాటర్, అన్ని సదుపాయాలు, సౌకర్యాలు అనుభవించిన హీరోకు ఈ పరిస్థితులు అన్ కంఫర్టబుల్ గానే ఉంటాయి

 

ఓరోజు ఎలాగోలా గడించింది, మర్నాడు తెల్లారితే ప్యాకప్, ఆరాత్రి ఆ ఊరి పెద్దమనిషి హీరో దగ్గరికి వచ్చి ఓ వినతి పత్రం అందజేశాడు, ఏంటి పెద్దాయన ఇది అని అమాయకంగా అడిగాడు ఆ హీరో

 

ఊరి పరిస్థితులు ఏమీ బాలేవు బాబూ, చాలామంది వలస పోతున్నారు, ఊరితో శాశ్వతంగా విడిపోతున్నారు, రోడ్లు, బడులు ఎలా ఉన్నా తాగడానికి గుక్కెడు నీళ్ళు కూడా లేని దారుణ పరిస్థితి, మీరేమైనా ప్రభుత్వానికి తెలియజేస్తారేమో అని చిన్న ఆశ అంటూ వినయపూర్వకంగా, ఉబికి వస్తున్న కన్నీళ్ళను తుడుచుకుంటూ అడిగాడు, మన సదరు హీరోగారు మాత్రం తన అసిస్టెంట్ కి ఆ పేపర్ ఇచ్చి మారు మాట్లాడకుండా వెళ్లి నిద్రపోయాడు…

 

కట్ చేస్తే….

Post midle

రెండు వారాల తరువాత, ఆఊరికి అదృష్టం పడిశం పట్టినట్టు పట్టింది, నీళ్ళకోసం ఫైపు లైన్లు వేశారు, పెచ్చులూడిపోయిన బడికి మరమ్మత్తులు చేశారు, రాజకీయ నాయకుడెవరో వస్తున్నట్టుగా రోడ్లు కూడా వేస్తున్నారు…

 

Post Inner vinod found

కానీ వీటి వెనుక ఏ రాజకీయ నాయకుడు లేడు ఇదంతా ఆఊరికి షూటింగ్ నిమిత్తం వచ్చిన హీరో సొంత ఖర్చులతో చేస్తున్న పని

 

దీనమ్మ జీవితం చుక్క నీటికోసం అల్లాడిపోతున్న ఆ గ్రామం ఆ గ్రామ ప్రజలు ఆరోజు నీళ్ళల్లో మునిగి తేలారు గురూజీ…

 

ఆరోజును ఆ గ్రామ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు, నీటితో పాటు నిలువెత్తు మానవత్వం అలా నడుచుకుంటూ వచ్చి ఆ పెద్దాయన ముందు నిలబడితే అందరూ చప్పట్లు కొట్టారు, ఆ పెద్దాయన మాత్రం ఆ నీళ్ళతో ఆ హీరో కాళ్ళు కడిగాడు, ఆ గ్రామ ప్రజలు ఆరోజు రెండు విధాలుగా తడిచారు, ఒకటి నీళ్ళతో రెండు కన్నీళ్ళతో….

 

గ్రామాలను దత్తత తీసుకోవాలనే ఆలోచన తనకు మొదలైందే ఆ ఊర్లో షూటింగ్ చేసేటప్పుడు అని చెప్పారు ఆ హీరో, తరువాత చాలా గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేశాడు, మీకు శ్రీమంతుడు సినిమా గుర్తు రావడంలో తప్పులేదు గురూజీ కానీ ఇది రియల్ స్టార్ రియల్ స్టోరీ

ఆ హీరో శ్రీహరి గారు, దానికి బీజం పడింది ఎక్కడంటే…

 

అందరికీ తెలిసే ఉండొచ్చు శ్రీహరి గారికి ఇద్దరు కొడుకులు అని, చాలా తక్కువ మందికే తెలుసు ఒక కూతురు ఉండేది అని, పేరు అక్షర, పాపంటే పంచ ప్రాణాలు శ్రీహరి అన్నకు, కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు లేదు, నాలుగు నెలల వయసులోనే పాప చనిపోవడం శ్రీహరి అన్నను చాలా బాధ పెట్టింది, ఆ సమయంలోనే ఆ గ్రామంలో షూటింగ్…

 

తన కూతురు పేరు మీద అక్షర ఫౌండేషన్ నెలకొల్పాడు, ఏమైందో ఏమో తన కూతురు తనతోనే ఉన్నంత సంతృప్తి కలిగింది, మనసుకు చాలా హాయిగా అనిపించింది, అప్పటిదాకా ఉన్న గుండె భారం ఒక్కసారిగా తగ్గిన ఫీల్ కలిగింది అంతే…

 

మేడ్చల్ పరిధిలోని నాలుగు గ్రామాలను దత్తత తీసుకుని, అక్కడి ప్రజలకు మినరల్ వాటర్ ను అందించి, గ్రామంలో అనేక మౌలిక సదుపాయాల సాధనకు కృషి చేసి, దాన్ని అలాగే కంటిన్యూ చేశాడు

 

జోహార్ #శ్రీహరి

Post midle

Comments are closed.