The South9
The news is by your side.
after image

బాలుది ఎంత పెద్ద మనసంటే..?

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొప్ప గాయకుడు, నటుడు, డబ్బింగ్ ఆర్టిస్టు మాత్రమే కాదు. గొప్ప వ్యక్తి కూడా. ఎంత ఎదిగినా కించిత్ అయినా గర్వం లేకుండా ఒదిగి ఉండే ఆయన వ్యక్తిత్వం.. ఆయన చూపించే వినయం.. వివిధ సందర్భాల్లో ఆయన పెద్ద మనసు.. ఇప్పుడు చర్చకు వస్తోంది. ఆయన మరణించిన నేపథ్యంలో బాలుకు సంబంధించిన అరుదైన వీడియోలను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అవి బాలును మరింత గొప్పవాడిని చేస్తున్నాయి. ఆయన ఔన్నత్యాన్ని చాటుతున్నాయి. తన అభిమానుల్ని ఆయన ఆదరించే తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన అభిమానులెవరైనా అనారోగ్యం పాలవడం లేదంటే వారి జీవితంలో ఏదైనా పెద్ద నష్టం చవిచూడటం లాంటివి జరిగి తనను వాళ్లు ఒకసారి కలిసి సాంత్వన పొందాలనుకుంటే వారిని స్వయంగా వెళ్లి కలిసేవారట.

Post Inner vinod found

ఈ తరహాలోనే శ్రీలంకకు చెందిన ఒక తమిళ అభిమాని కోసం వెళ్లి బాలు కలిసి అతణ్ని అమితానందానికి గురి చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. శ్రీలంకలో జరిగిన పేలుళ్లలో ఆ అభిమాని తన రెండు కళ్లూ కోల్పోయారు. ఆయనకు బాలు అన్నా, ఆయన పాటన్నా అమితమైన ఇష్టం. అతను తనను కలవాలనుకుంటున్నాడని తెలిసి బాలు స్వయంగా శ్రీలంకకు వెళ్లారు. కళ్లు పోయిన ఆ అభిమాని కుర్చీలో కూర్చుని ఉంటే తానెవరో చెప్పకుండా వెనుక నుంచి అతణ్ని తడుముతూ ప్రేమగా మాట్లాడి.. ‘బాలు’ గురించి ప్రస్తావన తెచ్చి.. తనపై అతడికున్న అభిమానమెంతో తెలుసుకుని.. తర్వాత నేనే బాలసుబ్రహ్మణ్యాన్ని అంటూ వెల్లడించి ఆ అభిమానిని సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాడు బాలు. ఇలా బాలు వెళ్లి కలిసిన, తన ఇంటికి పిలిపించుకుని మాట్లాడిన అభిమానులు మరెంతో మంది ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అలా బాలును కలిసిన ఎంతోమంది ఇప్పుడు తమ అనుభవాలను పంచుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ఒక సందర్భంలో శబరిమలైకి వెళ్లి అక్కడ డోలీలు మోసే వారికి పాదాభివందనం చేయడం, అలాగే తనకు ‘పాడుతా తీయగా’లో అవకాశమిచ్చి మరింతగా అభిమానులకు చేరువయ్యేలా చేసిన రామోజీ రావు పాదాలకు మొక్కడం లాంటి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తున్నాయి.
Tags: SP Balasubramanyam, SP Balu helps

Post midle

Comments are closed.