ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చెన్నైలోని ఎంజీఎం హెల్త్ కేర్ ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై శుక్రవారం సాయంత్రం వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కొరోనా లక్షణాలతో ఆయన ఈ నెల 5న హాస్పిటల్లో చేరారు. అయితే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం క్షీణించడంతో రాత్రి నుంచి ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments are closed.