మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన సమంత
ప్రతినిధి :south9
ఏడాదిన్నర నుంచి సినిమాలు చేయకపోయినా దక్షిణాదిలో నెంబర్ వన్ హీరోయిన్ గా చలామణి అవుతున్న అందాల బ్యూటీ సమంత. మయోసైటిస్ కోసం చికిత్స తీసుకునేందుకు ఈ విరామం ఇచ్చింది. తర్వాత తన సొంత బ్యానర్ తో సినిమా చేస్తుంది. ఇందులో ప్రియదర్శి ఎంపికయ్యారంటూ వార్తలు వస్తున్నాయి. మరో వెబ్ సిరీస్ చేస్తుంది సీటాడెల్ త్వరలోనే విడుదల కాబోతుంది.తన సొంత నిర్మాణ సంస్థ లో కొత్త వారిని పరిచయం చేస్తుంది. ప్రస్తుతం ఇలా సాగుతున్న సమంత జీవితంలో తెలంగాణ మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు కుదుపునకు లోను చేశాయి దీనిపై ఎంతో హుందాగా స్పందించిన సమంత మరోసారి వీటిపై మాట్లాడింది సీటాడెల్ సిరీస్ ప్రమోషన్లలో బిజీగా ఉన్న సమంత ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.ఈ ఇంటర్వ్యూలోనే కొండా సురేఖ వివాదం పై స్పందించారు. తాను ఈరోజు ఇలా కూర్చొని మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం సినిమా పరిశ్రమలోని ఎంతోమంది ప్రేమ అని చెప్పింది. తనపై వారికి ఉన్న నమ్మకం, ప్రేమ తనను ఈ స్థాయిలో ఉంచాయని , వారిస్తున్న మద్దతు కష్టాలను ఎదుర్కోవడానికి అవసరమైన ధైర్యాన్ని కల్పిస్తోందన్నారు. అటువంటివారు తనకు మద్దతు లేకపోతే కొన్ని కష్టమైన పరిస్థితులను అధిగమించలేకపోయేదాన్ని. వారి నమ్మకం వల్లే వాటిని ఎదుర్కోగలిగాను అన్నారు ఆన్లైన్లో తనపై వస్తున్న ట్రోల్స్‌పై కూడా సమంత స్పందించింది. అటువంటి వాటి గురించి తాను ఎక్కువగా ఆలోచించనని ద్వేషంతో కూడిన సందేశాలను అసలు తీసుకోనని వాటి ప్రభావం తనపై రాకుండా చూసుకుంటానంది. అటువంటివి పంపించేవారు తను అనుభవిస్తున్న బాధను అలాంటి బాధని అనుభవించారేమో అని ఆలోచిస్తానని సమంతా వెల్లడించింది. కొండ సురేఖ కేటీఆర్ పై విమర్శలు గుప్పిస్తూ నాగార్జున కుటుంబాన్ని కూడా ఇందులో గెలికిందిప సమంత, నాగార్జున,నాగచైతన్య లపై వ్యాఖ్యలు చేసింది ఈ విషయంపై నాగార్జున కోర్టులో సురేఖ పై పరువు నష్టం దావా దాఖలు చేశారు. ప్రస్తుతం నాంపల్లి కోర్టులో కేసు నడుస్తోంది.
Comments are closed.