The South9
The news is by your side.
after image

రూ. 340 కోట్లతో వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు శంకుస్థాపనచేసిన సీఎం జగన్.

*తేది: 15-11-2023*

*స్థలం: మాచ‌ర్ల*

 

*రూ. 340 కోట్లతో వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు శంకుస్థాపనచేసిన సీఎం జగన్*

 

*పల్నాడుకు కృష్ణా జాలాలు అందించబోతున్నాం.. పౌరుషాల పల్నాడు గడ్డను అభివృద్ధి గడ్డగా మారుస్తున్నాం*

 

*కుప్పం ప్రజలకే నీళ్లు ఇవ్వని చంద్రబాబు ఇతర ప్రాంతాలకు మేలు చేస్తాడా?*

 

*చంద్రబాబులాగా పొత్తులు పెట్టుకోవడం మాకు తెలియదు.. నా నమ్మకం, నా ధైర్యం మీరు*

 

పల్నాటి సీమ రూపురేఖ­లను సమూ­లంగా మార్చే దిశగా అడుగులు వేస్తూ పల్నాడు జిల్లా మాచర్ల వద్ద రూ. 340 కోట్లతో వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు శంకుస్థాపన చేశామ‌ని సీఎం జ‌గ‌న్ పేర్కొన్నారు. పౌరుషాల పల్నాడు గడ్డను అభివృద్ధి గడ్డగా మారుస్తున్నామ‌ని సీఎం పేర్కొన్నారు. పల్నాడుకు కృష్ణమ్మ జలాలు అందించబోతున్నామని సంతోషం వ్యక్తం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా గత పాలకులు ఈ ప్రాజెక్టు చేపట్టారని, ప్రస్తుతం అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశామ‌ని తెలిపారు. ఏదైనా పని చేయాలంటే పాలకులకు చిత్తశుద్ధి ఉండాల‌ని సీఎం పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును దశలవారిగా మాచర్ల, వినుకొండ, ఎర్రగొండపాలెం వరకు తీసుకెళ్తామని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా తాగు, సాగునీరు అందింబోతున్నామ‌న్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలతో పాటు మహిళా సాధికారితకు కృషి చేశామని, రూ.2 లక్షల 40 వేల కోట్లు అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్లాయని, డీబీటీ నాన్‌డీబీటీ ద్వారా రూ.4 లక్షల 10వేల కోట్లు అందించామని, కోవిడ్‌ సమయంలోనూ సంక్షేమ పథకాలు అందించామ‌ని సీఎం వివరించారు

 

Post midle

“దాశాబ్ధాలుగా ఈ పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులు, రూపురేఖలు మార్చాలనే తపన, తాపత్రయంతో ఈ రోజు రూ.340 కోట్లతో వరికపుడిసెల ఎత్తిపోతల ద్వారా కృష్ణ జలాలు అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడుతున్నాను.

గతంలో మీరంతా గమనించే ఉంటారు. ఈ పథకానికి ఎన్నికలకు కేవలం నెల ముందు ఇదే ప్రాజెక్టుకు ఎటువంటి అనుమతులు లేకపోయినా కూడా ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ చేయకుండానే గత పాలకులు వచ్చి మనందరిని మోసం చేసేందుకు టెంకాయ కొట్టారు. మనందరిని నమ్మించేందుకు ప్రయత్నం చేశారు. నిసిగ్గుగా మోసం చేశారు. ఇదే ప్రాజెక్టుకు ఈ రోజు అటవీ శాఖ అనుమతులు అన్ని కూడా నవంబర్‌ 6వ తేదీన వచ్చాయి. అభయ అరణ్యం కావడంతో వారికి సంబంధించిన అనుమతులు ఇదే ఏడాది మే మాసంలో అనుమతులు వచ్చాయి. మీ బిడ్డ ప్రభుత్వం ఏర్పడిన తరువాతే భూ సేకరణజరిగింది. ఇవన్నీ కూడా లేకుండానే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏ అనుమతులు లేకుండానే, భూ సేకరణ చేయకుండానే ఏ రకంగా ఆ పెద్దాయన అప్పట్లో చంద్రబాబు టెంకాయ కొట్టాడని గట్టిగా అడుగుతున్నాను. ఏదైనా పని చేయడానికి చిత్తశుద్ధి, నిజాయితీ ఉండాలి” అని సీఎం జగన్ పేర్కొన్నారు.

 

Post Inner vinod found

*పౌరుషాల పల్నాడు గడ్డను అభివృద్ధి గడ్డగా మారుస్తున్నాం*

 

అక్కచెల్లెమ్మలను మోసం చేయాలని అడుగులు వేస్తే ఏం జరుగబోతుందని 2019లో ప్రజలే గట్టిగా సమాధానం చెప్పారని సీఎం గుర్తుచేశారు. ఈ లిప్ట్‌ను నాలుగు పంపులతో నాగార్జున సాగర్‌కు ఎగువ భాగంలో నిర్మించి మొదటి దశ కింద 1.57 టీఎంసీల నీటిని తరలించడం ద్వారా 25 వేల ఎకరాలకు సాగునీరు, 20 వేలమంది జనాభాకు తాగునీరు అందుతుందని తెలిపారు. దాదాపుగా రూ.340 కోట్లతో ఈప్రాంతానికి నీటిని తీసుకువచ్చే కార్యక్రమం జరుగుతోందని అన్నారు. ఈ ప్రాజెక్టు ఈ ప్రాంతానికి ఎంత అవసరమో పూర్తిగా తెలిసిన వ్యక్తుల్లో నేను ఒకడినని, ఈ ప్రాంతం ప్రజల గుండె చప్పుడు తెలిసిన వ్యక్తిగా చుట్టుపక్కల నియోజకవర్గాలకు కూడా దశల వారీగా నీటిని అందిస్తామని భరోసా ఇచ్చారు. రాబోయే రోజుల్లో దశల వారీగా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామి ఇచ్చారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే 1.20 లక్షల ఎకరాలకు సాగునీరు, లక్ష మందికి తాగునీరు అందుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టే కాకుండా ఈ పల్నాడును, ఈ పౌరుషాల గడ్డను అభివృద్ధి గడ్డగామార్చేందుకు ఏడు దశాబ్ధాలుగా ఎవరూ కూడా సహసం చేయని విధంగా ఈ ప్రాంతాన్ని అభివృధ్ధి చేస్తూ అడుగులు వేశామని పేర్కొన్నారు. పల్నాడును ప్రత్యేక జిల్లా చేయడమే కాకుండా ఈ ప్రాంతానికి ఇప్పటికే వేగంగా పనులు జరుగుతున్న మెడికల్‌ కాలేజీని తీసుకువచ్చింది కూడా మనందరి ప్రభుత్వమే అని చెప్పడానికి గర్వపడుతున్నానని అన్నారు. ఈ రోజు ఒక్క పల్నాడే కాదు. .రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను ప్రజలను, ప్రధానంగా పేదవర్గాలను నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా నిరుపేద వర్గాలకు సామాజిక, ఆర్థిక, విద్య, మహిళా సాధికారత ఇవ్వడానికి ఈ 53 నెలల కాలంలో ప్రతి నిమిషం, ప్రతి రూపాయి ఖర్చు చేసిందని తెలిపారు.

 

*మోసాల చరిత్ర, వెన్నుపోట్ల చరిత్ర, అబద్ధాల చరిత్ర వారిది*

 

మన ప్రతిపక్ష నాయకుడికి రైతులను, అక్కచెల్లెమ్మలను, అవ్వతాతలను, పిల్లలకు మంచి చేస్తూ ఒక్క పథకం కూడా లేదని ఎద్దేవా చేశారు. గతంలో మనం చూసింది మోసాల చరిత్ర, వెన్నుపోట్ల చరిత్ర, అబద్ధాల చరిత్రను చూశామని, చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నా కూడా కనీసం ఒక మంచి స్కీమ్‌ తీసుకురాలేదని, ఒక్క మంచి కార్యక్రమం చేశానని ఈ పెద్దమనిషి ఓటు అడగడని దుయ్యబట్టారు. ఈ పెద్ద మనిషి ఎన్నికలు రాగానే అది చేస్తా, ఇది చేస్తా అంటూ మాయ మాటలు చెబుతాడని. ఈ రోజు మీ బిడ్డ మిమ్మల్ని అడుగుతున్నాడని, మీ ఇంట్లో మీకు మంచి జరిగితేనే నాకు తోడుగా ఉండండని అడిగారు. కానీ, చంద్రబాబు మంచి చేశానని చెప్పి ఓట్లు అడగడం లేదని, మళ్లీ మోసం చేసేందుకు, వెన్నుపోటు పొడిచేందుకు మీ కేజీ బంగారం కొనిస్తానని ఓట్లు అడుగుతున్నాడని ప్రజలు తేడా గమనించాలని కోరారు.

 

*కుప్పంకి నీరు ఇవ్వనివాడు మన మాచర్లకు, మన పల్నాడుకు నీరు ఇస్తామంటే నమ్మగలమా?*

 

చంద్రబాబు చివరికి తన సొంత నియోజకవర్గం కుప్పంలో 34 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆ నియోజకవర్గానికి నీరు ఇచ్చిన చరిత్ర చంద్రబాబుకు లేదని గుర్తుచేశారు. కుప్పానికి నీరు ఇవ్వని ఈ చంద్రబాబు మన మాచర్లకు, మన పల్నాడుకు ఈ పెద్ద మనిషి నీరు ఇస్తామంటే నమ్మగలమా? అని ప్రశ్నించారు

 

“కన్న తల్లికి అన్నం పెట్టని వాడు..పిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తా అని గతంలో ఒకడు అన్నాడట..ఈ పెద్దమనిషి చంద్రబాబు మాటలు కూడా అలాగే ఉన్నాయి. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో రెవెన్యూ డివిజన్‌ కూడా ఏర్పాటు చేయలేకపోయాడు. ఇక మన పల్నాడుకు గానీ, మరో ప్రాంతానికి గానీ, మనసామాజిక వర్గాలకు మంచి చేస్తారని ఎవరైనా నమ్ముతారా? కుప్పానికి నీళ్లు కావాలన్నా..కుప్పంకు రెవెన్యూ డివిజన్‌ కావాలన్నా కూడా చేసేది మీ బిడ్డే అని చెప్పడానికి గర్వపడుతున్నాను. పొదుపు సంఘాల రుణాలను మొదటి సంతకంతోనే మాఫీ చేస్తానని చెప్పిన మనిషి..చివరికి ఆ సంఘాలను సీ, డీ గ్రేడ్‌లుగా పరపతిని దిగజార్చారు. నా అక్కచెల్లెమ్మలను అప్పులపాలు చేశాడు. జగనన్న అమ్మ ఒడి, వైయస్‌ఆర్‌ ఆసరా, వైయస్‌ఆర్‌ చేయూత, సున్నా వడ్డీ, 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు ఏనాడైనా చంద్రబాబు చేశాడా? ఆయన చేస్తామంటే నమ్మగలమా? ఈ పెద్ద మనిషి చూస్తే ఒక సామెత గుర్తుకు వస్తుంది. ఒకాయన ఎప్పుడూ మంచానికి పరిమితమై ఉంటాడట. లేస్తే మనిషికి కాదంటాడు..కానీ మంచం మీద నుంచి లేయలేడు.ఏ సామాజిక వర్గానికైనా భవిష్యత్‌ మారుతుందనే నమ్మకం ఉంటుందా? ఇలాంటి పెద్ద మనిషి రేపు పొద్దున మీ వద్దకు వచ్చి నేను మారానని అంటే నమ్మగలమా? చంద్రబాబు కూడా ఎప్పుడూ ఇలాగే చెబుతాడు. కానీ మంచి మాత్రం చేయడు. ఆయన 2000 సంవత్సరం గురించి చెప్పడు కానీ 50 ఏళ్ల విజన్‌ అంటాడు. 50 ఏళ్ల తరువాత ఎవడు ఉంటాడు.. ఎవడు పోతాడో ఎవరికి తెలియదు. ప్రజల చెవ్వుల్లో క్వాలీఫ్లవర్స్‌ పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు.” అని సీఎం దుయ్యబట్టారు

 

*నేను పొత్తులను నమ్ముకోలేదు, నా నమ్మకం, నా ధైర్యం మీరు*

 

ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయని, చంద్రబాబుకితోడు మరో నలుగురిని కలుపుకుంటాడు. ప్రతి ఇంటికి బెంజి కారు, కేజీబంగారం ఇస్తామంటున్నాడని, 11 హామీలు ఇస్తామని చెబుతున్నాడని, 2014లో కూడా ఇదే దత్తపుత్రుడు, చంద్రబాబుతో కలిసి పోటీ చేశాడని, కలిసే మేనిఫెస్టో విడుదల చేశారని, ఇదే దత్తపుత్రుడు ఆ మేనిఫెస్టోకు నేను పూచీ అని చెప్పాడని, వీరు సరిపోరని మోదీని కూడా కలుపుకున్నాడని సీఎం గుర్తు చేశారు. ఈ రోజు వారి మాటలు చూస్తే వీరు నిజంగా మనుషులేనా? వీరికి సిగ్గుందా? అని మండిపడ్డారు. ఇంత దారుణంగా ప్రజలను మోసం చేస్తున్నా కూడా ఇటువంటి వారిని సమర్ధించేందుకు ఆయనకు ఒక వర్గం ఉందని, ఒక ఎల్లోమీడియా, ఒక దొంగల ముఠా తోడు ఉందని, బాబు నేరాలను కప్పిపెట్టేందుకు, విచారణ జరుగకుండా అడ్డుకునేందుకు, వ్యవస్థలనుమేనేజ్‌ చేసేందుకు అనేక మంది ఆయన మనుషులు ఉన్నారని, వీళ్లందరూ కూడా మనకళ్లేదుటే కనిపిస్తారని, వీరంతా కూడా ఎవరి కోసం రాజకీయాలు చేస్తారని ఆశ్చర్యమనిపిస్తుందని అన్నారు. వీరు రాజకీయం చేసేంది కేవలం ప్రజలను దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడానికి, నిజంగా రాజకీయ వ్యవస్థమీదే నమ్మకం పోతుందని, వీరంతా దొంగల ముఠాగా మారాని, ఇలాంటి రాజకీయాలు చేయడం, ఇలాంటి పొత్తులు పెట్టుకోవడం మీ బిడ్డకు చేత కాదని మరోసారి స్పష్టం చేశారు. ఒక వైయస్‌ఆర్‌ కానీ, ఒక జగన్‌కు గానీ తెలిసింది, ప్రజలతో నడవడం, ప్రజల గుండె చప్పుడు వినడమని అన్నారు. తాను ప్రజల్లోకి వెళ్లినప్పుడు ఒక్కటే ఒక్కటి చెబుతానని, “నేను విన్నాను..నేను ఉన్నాన”ని మీ బిడ్డ చెబుతాడని ఉద్ఘాటించారు. అధికారంలోకి వచ్చిన తరువాత చెప్పిన మాటను, ఎన్నికల మేనిఫెస్టోను ఒక బైబిల్‌గాను, ఒక ఖురాన్‌గాను, ఒక భగవద్గీతగాను భావించి ప్రజల కోసం, అక్కచెల్లెమ్మల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు ప్రతిక్షణం తపిస్తూ మీ బిడ్డ అడుగులు వేశాని వివరించారు. మీ బిడ్డ ఈ పొత్తులను నమ్ముకోలేదని ఉద్ఘాటించారు. మీ బిడ్డకు పచ్చ మీడియా లేదని, దత్తపుత్రుడు తోడుగా లేడని, మీ బిడ్డ నమ్మింది పైన ఉన్న దేవుడు, కింద ఉన్న మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నాడని చెప్పారు. మీ బిడ్డకు దళారులు అవసరం లేదని, మీ బిడ్డ నమ్మేదల్లా చేసిన మంచినే అని, నా ధైర్యం ఇంటింటికీ చేసిన మంచి, అన్ని సామాజిక వర్గాలకు, అన్ని ప్రాంతాలకు చేసిన మంచే నా ధైర్యం అని స్ఫష్టం చేశారు

Post midle

Comments are closed.