రాంగోపాల్ వర్మ ఈ పేరు ఒక సంచలనం, ఒకప్పుడు తన దర్శకత్వ ప్రతిభతో మంచి చిత్రాలు ను తెరకెక్కించిన వర్మ, రాను రాను నాసిరకం కథలతో బి గ్రేట్ చిత్రాలు తీస్తున్నాడని తన అభిమానులే విమర్శించే పరిస్థితికి రావడం జరిగింది. అయితే ఏ ఒక అంశం గురించి అయినా తన అభిప్రాయాన్ని లాజిక్ గా చెప్పడం తో ఆయనకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో సంచలనానికి తెరలేపారు రామ్ గోపాల్ వర్మ. గతంలో విజయవాడ రాజకీయ నేపథ్యం గా వంగవీటి అనే చిత్రాన్ని, రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో రక్త చరిత్ర చిత్రాలను తీసిన ఘనత వర్మ కే చెల్లింది. తాజాగా వరంగల్ బ్యాక్ డ్రాప్ తో తెలంగాణలోని రాజకీయ నాయకుడైన కొండా మురళి, మాజీ నక్సలైట్ నేత ఆర్.కె అలియాస్ రామకృష్ణ అనుబంధంపై 80వ దశకం లో పెత్తందార్ల ఆదిపత్యం పై బడుగువర్గాల తిరగబడిన పరిస్థితులను చూపించబోతున్న ట్లు వర్మ తెలిపారు. ఈ సినిమా గురించి కొండా మురళి తో చర్చించినట్లు ఆయన సానుకూలంగా స్పందించినట్లు వర్మ తెలియజేశారు.” కొండ “అనే పేరుతో చిత్రం రాబోతుందని తెలిపారు. వాస్తవిక కథలకి తన మార్క్ డైరెక్షన్ తో అద్భుతంగా తెరకెక్కించగల రాంగోపాల్ వర్మ ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులను అలరించే విధంగా తీస్తాడని ఆశిద్దాం.
Comments are closed.