హాస్పిటల్ లో చేరిన రకుల్ ప్రీత్ సింగ్…. ఆరు రోజులు బెడ్‌పైనే…. ఏం జరిగిందంటే...
సౌత్ 9 :ప్రతినిధి
తెలుగు, హిందీ సినిమా రంగాల్లో రాణిస్తున్న టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తీవ్రమైన గాయాలతో హాస్పిటల్లో చేరారు. ఫిట్నెస్ వర్కౌట్ ను పిచ్చిగా చేసే సమయంలో ఆమె ప్రదర్శించిన అత్యుత్సాహం హాస్పిటల్లో పాలు చేసింది. దాంతో ఆమె స్నేహితులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేయడంతో స్వయంగా ఆమె హాస్పిటల్ బెడ్ నుంచి వీడియోను చేశారు. తన హెల్త్ అప్డేట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇండియన్ సినిమా రంగంలో ఫిట్నెస్పై అత్యంత శ్రద్ధ చూపి హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ మొదటి స్థానంలో ఉంటుంది.. ఆమె తన బాడీని ఫిట్టుగా ఉంచుకునేందుకు నిరంతరం ఆమె జిమ్లో కనిపిస్తుంటుంది. పురుషులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఏదో పిక్స్ వర్కౌట్ చేస్తున్న వీడియోలు పెడుతుంటుంది. ఆమె పడే కష్టానికి ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. అయితే అలా మితిమీరిన ఉత్సాహంతో రకుల్ చేసిన ఒక వర్కౌట్స్ శృతి మించడంతో వెన్నెముకకు తీవ్ర గాయం అయింది. దాంతో ఆమెను వెంటనే హాస్పిటల్ లో చేర్పించారు. గత ఆరు రోజులుగా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. మరో 8 రోజులు పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. చేసిన తను చేసిన ఈ పిచ్చి పని వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ఆమె తన వీడియోలో వెల్లడించారు. సోషల్ మీడియా ద్వారా వీడియోలు చేసిన వీడియోలో మాట్లాడుతూ నన్ను అభిమానిస్తూ ఆందోళనకు గురైన నా ఫ్యాన్స్ కు నా హెల్త్ అప్డేట్ ఇవ్వాలని అనుకున్నాను. నేను వర్కౌట్ చేసేటప్పుడు చేసిన పిచ్చి పని కి నాకు తీవ్రంగా గాయమైంది. నేను స్టుపిడ్ పనిచేశాను. నా మైండ్ చెప్పిన విషయాన్ని పట్టించుకోకుండా చేసిన పనికి తీవ్ర గాయం అయింది అని వీడియోలో తెలిపారు. నీ శరీరం భరించలేదని చెప్పినప్పుడు వినాలి. నా బాడీ కంటే మానసికంగా స్ట్రాంగ్ గా ఉంటానని భావించాను. దాంతో శరీరంపై విపరీతమైన ఒత్తిడి భారం వేశాను. దాంతో నేను తీవ్రంగా గాయపడ్డాను. దాంతో హాస్పిటల్ లో చేరాను. త్వరలోనే నేను కోలుకుని దృఢంగా మానసికంగాస్ట్రాంగ్ అవుతాను అన్న నమ్మకం ఉంది.. నాపై ప్రేమను అభిమానాన్ని కురిపిస్తున్న వారందరికీ లాట్సాఫ్ లవ్ అని వీడియోలో తెలిపారు. రకుల్ ప్రీత్ సింగ్ కెరియర్ విషయానికి వస్తే ఆమె గ్రాఫ్ అంతంత మాత్రం గానే ఉంది. ఇటీవల ఆమె నటించిన ఆయలాన్, ఇండియన్ టు సినిమాలు పెద్దగా విజయం సాధించలేదు. అంతకు ముందు నటించిన చిత్రాలు కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రస్తుతం ఇండియన్ త్రీ దేదే ప్యార్ దే2 సినిమాలో నటిస్తున్నారు. ఇటీవల వివాహం చేసుకున్న ఆమె దాంపత్య జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.
Comments are closed.