The South9
The news is by your side.
after image

పులి the 19th century మొదటి పాట విడుదల

పులి the 19th century మొదటి పాట విడుదల

సిజు విల్సన్ ప్రధాన పాత్రలో కాయాదు లోహర్ కథానాయిక తెరకెక్కించిన మలయాళం యాక్షన్ పీరియడ్ డ్రామా ‘పాథోన్‌పథం నూట్టండు’. వినయన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా హక్కుల కోసం ఎంతో మంది పోటీపడగా ‘అమ్మదొంగ’ లాంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ సీనియర్ నిర్మాత సిహెచ్. సుధాకర్ బాబు ఫ్యాన్సీ రేటుకి దక్కాయి. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని ప్రముఖ నిర్మాత కెఎస్.రామారావు ఆవిష్కరించారు.

ఆల్ ఇండియాఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ ‘పులి’ అనే టైటిల్ తో తెలుగులో విడుదలవుతోంది. ’19వ శతాబ్దం’ అన్నది ఉపశీర్షిక. తాజాగా ఈ చిత్రం సంబధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఫస్ట్ లుక్ లో కదనరంగంలో ఖడ్గవీరుడిగా కనిపించారు సిజు విల్సన్.

Post Inner vinod found

తెలుగు రైట్స్ దక్కించుకుంటున్న నిర్మాత సిహెచ్. సుధాకర్ బాబు మాట్లాడుతూ.. ఈ చిత్రం మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. త్వరలో ఈ తెలుగులో చాలా గ్రాండ్ గా విడుదల చేస్తున్నాం. మంచి కథ, కథనంతో గొప్ప థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చాడుే చిత్రమిది. తెలుగు ప్రేక్షకులు కూడా తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం వుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ని చెప్పవచ్చు అన్నారు.

ఎస్ కె. రామచంద్రనాయక్ సహ నిర్మాతగా ఈ చిత్రంలో అనూప్ మీనన్, పూనమ్ బజ్వా ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. షాజీ కుమార్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి ఎం. జయచంద్రన్ సంగీతం అందించారు, సంతోష్ నారాయణన్ నేపధ్య సంగీతం సమకూర్చారు. వివేక్ హర్షన్ ఎడిటర్ గా, అజయ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా, మాఫియా శశి, కె. రాజశేఖర్, ఎస్.జి. సోమసుందరం ఫైట్ మాస్టర్స్ గా పని చేశారు. ఈచిత్ర మొదటి పాటని నిన్న tips music ద్వారా విడుదల చేశారు. ప్రేక్షకుల దగ్గరనుండి మంచి స్పందన లభిస్తోందని ప్రొడ్యూసర్ సుధాకర్ బాబు తెలిపారు.

తారాగణం: సిజు విల్సన్, కాయదు లోహర్, అనూప్ మీనన్, పూనమ్ బజ్వా సాంకేతిక విభాగం: రచన, దర్శకత్వం : వినయన్ నిర్మాత: సిహెచ్.సుధాకర్ బాబు సహ నిర్మాత : ఎస్.కె రామచంద్రనాయక్ బ్యానర్ : ఆల్ ఇండియా ఎంటర్టైన్మెంట్ సంగీతం: ఎం. జయచంద్రన్ నేపధ్య సంగీతం : సంతోష్ నారాయణన్ సినిమాటోగ్రఫీ: షాజీ కుమార్ ఎడిటర్ : వివేక్ హర్షన్ ఆర్ట్ : డైరెక్టర్ అజయ్ కుమారన్ ఫైట్స్ : మాఫియా శశి, కె. రాజశేఖర్, ఎస్.జి. సోమసుందరం పీఆర్వో : వంశీ-శేఖర్

Post midle

Comments are closed.