ముంబై : కేంద్రం తీసుకు వస్తున్న సినిమాటోగ్రఫీ చట్టం సవరణ బిల్లు 2021 ముసాయిదాపై ప్రజలు స్పందించాలని ప్రభుత్వం గత నెల 18న ఒక ప్రకటన విడుదల చేసింది. దీనికి వ్యతిరేకంగా శుక్రవారం నాడు ట్రేడ్ ఫిలిం కి సంబంధించిన ఆరు అసోసియేషన్లు కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ ముసాయిదాలో సినిమాకి సంబంధించిన పైరసీ జరిగితే దాన్ని నేరంగా పరిగణిస్తూ జైలు శిక్షతోపాటు జరిమానా విధించడం. సినిమాకు సంబంధించిన సర్టిఫికెట్ వచ్చిన తర్వాత ప్రజల్లో ఏమైనా అభ్యంతరాలు వస్తే మరల పున సమీక్షించాల్సిన అధికారం కేంద్రం చేతిలో ఉంటుంది. దీనితో పాటు తదితర అంశాలను ఆ ముసాయిదాలో పొందుపరిచారు. దీనికి సంబంధించి సినీ వర్గాలు రీ సర్టిఫికేషన్ విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధమని , భావప్రకటనా స్వేచ్ఛపై దాడి లాంటిదని పలువురు సినీ ప్రముఖులు, సమాచార , ప్రచార శాఖలకు లేఖల ద్వారా తమ నిరసనను తెలియజేశారు.
Comments are closed.