*సమస్యలు లేని గ్రామాలే లక్ష్యం : ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*
*: పెద్దబ్బీపురంలో గడప గడపకు మన ప్రభుత్వం*
*సమస్యలు లేని గ్రామాలే లక్ష్యంగా పనిచేయాలనే ఉద్దేశ్యంతోనే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారని, దీని ద్వారా గ్రామాల్లో ప్రజలకు ప్రభుత్వం అందచేస్తున్న లబ్దితో పాటు వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు వీలు కలుగుతుందని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు.*
*శుక్రవారం ఏఎస్ పేట మండలం పెద్దబ్బీపురం సచివాలయం పరిధిలో రెండవ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.*
*ఈ సందర్భంగా సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలు తెలిపిన సమస్యలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.*
*ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ తాము నిర్వహించిన సర్వేలో అధికంగా రెవెన్యూ సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వెంటనే మండల రెవెన్యూ అధికారులు వాటి పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.*
*రెవెన్యూలో సాంకేతిక సమస్యల కారణంగా పొలాలు లేని వారికి సైతం పొలాలు ఉన్నట్లుగా నమోదు అయి పించన్లు, ప్రభుత్వ పథకాలు నిలిచిపోతున్నాయని, వెంటనే ఇలాంటి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.*
*రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన సచివాలయాల వ్యవస్థ ద్వారా ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా సిబ్బంది చొరవ చూపుతున్నారని, కానీ నిర్ణీత గడువులోపే సమస్యలను పరిష్కరించి ప్రజలకు అందిస్తేనే దానికి సార్థకత ఉంటుందని పేర్కొన్నారు.*
*గ్రామాల్లో విధులు నిర్వర్తించే వాలంటీర్లు ఎప్పటికప్పుడు సమస్యలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకుని రావాలని, సచివాలయ పరిధిలో ప్రతి వారం సమావేశాలు నిర్వహించుకుని పెండింగ్ లో ఉన్న సమస్యలు, పరిష్కారమైన సమస్యలను గుర్తించుకోవాలని అన్నారు.*
*మండలస్థాయి అధికారులు సైతం రెండు నెలలకోమారు సచివాలయం పరిధిలో రివ్యూ సమావేశం నిర్వహిస్తే సమస్యలను త్వరితగతిన పరిష్కారమవుతాయని సూచించారు. రైతులు ఇబ్బందులు పడకుండా రెవెన్యూ అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు.*
*అభివృద్ది పనులకు సంబంధించి వివరాలను తెలియచేస్తే వాటిని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అవసరమైన నిధుల మంజూరుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.*
*సమస్యలు లేని గ్రామాలే లక్ష్యంగా అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు విధులు నిర్వహించాలని, ప్రజాప్రతినిధులు, నాయకుల సహాయ సహకారాలు తీసుకోవాలని సూచించారు.*
Comments are closed.