The South9
The news is by your side.
after image

రేపల్లె అత్యాచార ఘటనలోగంటల వ్యధిలోనే ముద్దాయిలను గుర్తించి అదుపులోకి తీసుకున్నా పోలీస్ అధికారులు.

*బాపట్ల జిల్లా. తేది:01.05.2022*

 *రేపల్లె రైల్వే స్టేషన్ లో జరిగిన అత్యాచార ఘటనను సవాలుగా తీసుకున్న జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ 

 *బాధితరాలినీ పరామర్శించి, నేర స్థలాన్ని పరిశీలించినా జిల్లా ఎస్పీ *

 *జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో నిష్ణాతులు అయిన అధికారులతో కేసు దర్యాప్తుకు మూడు టీమ్ లు ఏర్పాటు*

 *డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం ల సహాయంతో భౌతిక ఆధారాల సేకరణ: జిల్లా ఎస్పీ *

 *గంటల వ్యధిలోనే ముద్దాయిలను గుర్తించి అదుపులోకి తీసుకున్నా పోలీస్ అధికారులు రేపల్లె*

 

ప్రకాశము జిల్లా, యర్రగొండ పాలెం మండలంకు చెందనబాధిత మహిళ తన భర్త, పిల్లలతో కలసి కూలి పనుల నిమిత్తము, కృష్ణా జిల్లా నాగాయలంక వెళ్ళుటకు ది 30.04.2022 వ తేదీన రాత్రి 9 గంటలకు గుంటూరు నుండి తెనాలి వచ్చు ట్రైన్ ఎక్కి తెనాలి లో దిగి, అక్కడ నుండి రేపల్లె వైపు వెళ్ళు ట్రైన్ ఎక్కి రాత్రి 11.30 గంటలకు రేపల్లె వచ్చినట్లు, ఆ అర్దరాత్రి సమయములో నాగాయలంక వెళ్ళలేక ప్లాట్ ఫారం చివర పడుకున్నట్లు, అర్దరాత్రి షుమారు 1 గంట సమయములో ముగ్గురు వ్యక్తులు వచ్చి పడుకున్న వారిని నిద్ర లేపి టైమ్ అడిగినట్లు, బాధితురాలి భర్త తన వద్ద వాచ్ లేదని చెప్పడముతో వారు, అతనితో గొడవ పెట్టుకుని, గొంతుపై కాలు వేసి చంపడానికి ప్రయత్నం చేసి, భాదితురాలి భర్త వద్ద ఉన్న 750/- రూపాయలు బలవంతముగా లాక్కొనినట్లు, అంతలో భాదితురాలు వారికి అడ్డుపడగా, సదరు ముద్దాయిలు ఆమెను కుడా కొట్టి దూరముగా లాక్కొని వెళ్లి ప్లాట్ ఫారము పైనే అత్యాచారము చేసినట్లు. ఆసమయములో భాదితురాలి భర్త, రేపల్లె పోలీస్ స్టేషన్ కు వచ్చి సదరు విషయాని తెలియ చేయగా డ్యూటీ లో ఉన్న పోలీస్ అధికారులు వెనువెంటనే స్పందించి బాధితురాలి భర్త తో రైల్వే స్టేషన్ కు పోలీస్ జీపులో రాగా అది గమనించిన ముద్దాయిలు అక్కడనుండి పారిపోయినారు.

 

Post midle

*భాదితురాలి భర్త ఇచ్చిన రిపోర్ట్ ఆదారముగా రేపల్లె టౌన్ CI V.సూర్యనారాయణ కేసు నంబర్ 123/2022 u/s 376 –(D) 394, 307 r/w 34 IPC గా కేసు నమోదు చేసినారు*

 

Post Inner vinod found

బాపట్ల జిల్లా ఎస్పీ ఆదేశాలతో బాపట్ల DSP A శ్రీనివాసరావు దర్యాప్తు ప్రారంబించినారు ధర్యాప్తు లో బాగముగా బాపట్ల SP వకుల్ జిందాల్ ఆదేశముల మేరకు బాపట్ల DSP A శ్రీనివాసరావు , రేపల్లె అర్బన్ పోలీస్ స్టేషన్ CI V సూర్యనారాయణ సహకారముతో డాగ్ స్కాడ్ మరియు క్లూస్ టీమ్ వారు ఇచ్చిన ఆధారములతో సదరు కేసులో ముద్దాయిలను ది: 01.05.2022 వ తేదీన మద్యాహ్నము 1 గంట సమయములో రేపల్లె పట్టణము లోని నేతాజీనగర్ లో అరెస్ట్ చేసి వారి వద్ద నుండి నేరానికి సంబందిచిన వస్తువులను సీజ్ చేసినారు.

 

*ముద్దాయిల వివరములు*

 

1. పాలుబొయిన విజయకృష్ణ s/o నాగేశ్వర రావు, 20 సంవత్సరములు, C/యాదవ, 24 వ వార్డ్, నేతాజీనగర్, రేపల్లె పట్టణము. (టైల్స్ వర్క్)

 

2. పాలుచురి నిఖిల్ s/o బెనహర్, 25 సంవత్సరములు, C/మాదిగ, నేతాజీనగర్, 24 వ వార్డ్, నేతాజీనగర్, రేపల్లె పట్టణము. ( డిజే వర్క్)

 

3. చట్టంతో సంఘర్షణ పడుతున్న బాలుడు ( పలు దొంగతన కేసులలో ముద్దాయి గా ఉన్నాడు.)

 

*నేరము చేసిన విధానము*

 

చట్టముతో సంఘర్షణ పడుతున్న బాలుడు గతములో పలు దొంగతనము కేసులలో ముద్దాయిగా ఉండి రిమాండ్ కు కుడా వెళ్లి వచ్చినట్లు, అలాగే మిగిలిన ఇద్దరు ముద్దాయి లు చెడు వ్యసనాలకు బానిసై, గత రాత్రి రైల్వే స్టేషన్ లోకి వచ్చి ప్లాట్ ఫారం పై నిద్రిస్తున్న బాదితురాలు భర్తతో గొడవ పడి అతనిని కొట్టి,అతని వద్ద డబ్బులు లాక్కొని, బాదితురాలి పై అత్యాచారము చేసినారు.

 

నేరము జరిగిన వెనువెంటనే స్పందిoచి, నేరము జరిగిన కొద్ది గంటల లోనే నేరాన్ని చేదించి ముద్దాయిలను అరెస్ట్ చేసిన బాపట్ల DSP A శ్రీనివాసరావు ని, అరెస్ట్ కు సహకరించిన రేపల్లె టౌన్ పోలీస్ స్టేషన్ CI V సూర్యనారాయణ ని, SI,s అబ్దుల్ రజాక్, కిరణ్ బాబు మరియు సిబ్బంది ని, SP అభినందించారు. . అలాగే ఈ కేసులో దర్యాప్తు ను దిశా చట్టము ప్రకారము వెంటనే పూర్తి చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేయవలసినదిగా SP DSP కి సూచిoచినారు..

Post midle

Comments are closed.