తిరుపతి ఉప ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా బలపరిచిన పోటీ చేస్తున్న మన పాటి చక్రవర్తి ఈరోజు నెల్లూరు నందు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ… తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా బలపరిచిన అభ్యర్థిగా బరిలో ఉన్నానని ఎన్నికల సంఘం నాకు కుట్టు మిషన్ గుర్తు కేటాయించారని అందరూ కుట్టు మిషను గుర్తుకి ఓటు వేయాలని విన్నవించుకున్నారు. అలానే గత 15 సంవత్సరాలుగా వివిధ పత్రికల్లో జర్నలిస్టుగా పని చేస్తూ నిత్యం ప్రజల సమస్యలపై పోరాటం చేశానని అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనందరికీ ఓటు హక్కు కల్పించారు అని ఆయన రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని ఈ సందర్భంగా కోరారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని ఏ సమస్య వచ్చినా తన ను సంప్రదించవచ్చని, తన నెంబర్ కి 8519823999 కాల్ చేస్తే స్పందిస్తానని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా బలమైన ఆయుధం అని దానిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు . గెలిచే వారికే ఓటు వేయాలని భావన నుంచి ఈ వ్యక్తి ఓడిపోతాడు అని తెలిసి కూడా ఆ వ్యక్తికి ఓటు వేసి ప్రజాస్వామ్యంలో నిరసన తెలియపరచాలని ఈ సందర్భంగా తెలిపారు. తిరుపతి పార్లమెంటు ఓటర్లు కి తనకు ఒక అవకాశం కల్పించి కుట్టుమిషన్ గుర్తుపై ఓటు వేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులను, అలాగే రిజర్వేషన్లు పొందిన అధికారులు ను, వ్యాపారవేత్తలను ,అందరిని తనను ఆదరించాలని ఆశీర్వదించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది సాల్మన్. విజయ్ అనిల్. జర్నలిస్ట్ రామ్మోహన్ రావు , బాబా కిరణ్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు
Comments are closed.