సినిమా కంటే ముందు పుస్తకరూపంలో
*”ప్యారీ” తారావలి నిజజీవిత గాథ!!*
మధ్యప్రదేశ్ లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతున్న చిత్రం “ప్యారీ”. లక్ష్మణ్ అనే యువకుడు – ప్యారి అనే యువతి నడుమ నడిచిన ప్రేమకు సాక్షాత్కారమే ఈ చిత్రం. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుండగానే ఈ ప్రేమకథను పుస్తకం రూపంలో “ప్యారి తారావలి ది ట్రూ స్టోరీ” పేరుతో ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు ఫిల్మ్ మేకర్స్!!
రజనీష్ దూబే రాసిన “ప్యారి – తారావలి ది ట్రూ లవ్ స్టోరీ” అమెజాన్, ఫ్లిప్ కార్డ్, కిండిల్, ప్లే స్టోర్, గూగుల్ బుక్స్, కోబో, ఐ బుక్స్ వంటి మాధ్యమాల్లో లభ్యం కానుంది. ప్రేమ తాలూకు ఓ గొప్ప పార్శ్వాన్ని అత్యద్భుతంగా ఆవిష్కరించే “ప్యారి” ప్రేమాస్పదులైన ప్రతి ఒక్కరినీ రంజింప చేస్తుందని దర్శకనిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు!!
Comments are closed.