*నెల్లూరు, 04.02.2021*
నెల్లూరు జిల్లాలో గురువారం రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఎన్.రమేష్ కుమార్ పర్యటించారు. నెల్లూరు నగరంలోని నూతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్…, జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు, గుంటూరు రేంజ్ డి.ఐ.జి. త్రివిక్రమ్ వర్మ, అడిషనల్ డి.జి. సంజయ్, జిల్లా ఎన్నికల పరిశీలకులు బసంత్ కుమార్, జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్, నోడల్ అధికారులు, జిల్లా అధికారులతో గ్రామ పంచాయతీ ఎన్నికల-2021 ప్రక్రియపై సమీక్షా, సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియపై ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలు గురించి జిల్లా కలెక్టర్, నోడల్ అధికారులను అడిగి ఎస్.ఈ.సి. వివరాలు తెలుసుకున్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని, ఓటర్లు పోలింగ్ బూత్ కు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు, ఎస్పీ భాస్కర్ భూషణ్ కు.., ఎస్.ఈ.సి. సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు మాట్లాడుతూ.., జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను నాలుగు విడతల్లో నిర్వహిస్తున్నామని.., రాష్ట్ర ఎన్నికల కమీషనర్ శ్రీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి తెలిపారు. మొదటి విడత కావలి రెవెన్యూ డివిజన్, రెండో విడత ఆత్మకూరు రెవెన్యూ డివిజన్, మూడో విడత గూడూరు, నాయుడుపేట రెవెన్యూ డివిజన్, నాలుగో విడత నెల్లూరు రెవెన్యూ డివిజన్ లలో ఎన్నికలు జరగనున్నాయని.., ఇప్పటికే కావలి రెవెన్యూ డివిజన్ లో నామినేషన్ల ప్రక్రియ పూర్తైందని, స్క్రూటినీ ప్రక్రియ చివరి దశలో ఉందని ఎస్.ఈ.సి కి వెల్లడించారు. కావలి రెవెన్యూ డివిజన్ పరిధిలోని పంచాయతీల్లో 09.02.2021 వ తేదీన, ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని పంచాయతీల్లో 13.02.2021 వ తేదీన, గూడూరు, నాయుడుపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని పంచాయతీల్లో 17.02.2021వ తేదీన, నెల్లూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని పంచాయతీల్లో 21.02.2021వ తేదీన పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. 941 గ్రామ పంచాయతీల్లోనూ పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు సిబ్బందిని నియమించామని, వారికి శిక్షణ కూడా అందించామన్నారు. మొదటి విడత ఎన్నికల షెడ్యూల్ లో భాగంగా 09.02.2021న కావలి రెవెన్యూ డివిజన్ పరిధిలోని 163 పంచాయతీల్లో ఎన్నిక జరగనుందని, రెండో విడత ఎన్నికల షెడ్యూల్ లో భాగంగా ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని 194 పంచాయతీల్లోనూ, మూడో విడత ఎన్నికల షెడ్యూల్ లో భాగంగా గూడూరు, నాయుడుపేట రెవెన్యూ డివిజన్ లలోని 342 పంచాయతీల్లోనూ, నాలుగో విడత ఎన్నికల షెడ్యూల్ లో భాగంగా నెల్లూరు రెవెన్యూ డివిజన్ లో 236 పంచాయతీల్లోనూ ఎన్నికల జరగనున్నాయని, దీనికోసం జిల్లా అధికారులు అందరూ సమన్వయంతో పనిచేస్తూ, పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. నాలుగు విడతల ఎన్నికల ప్రక్రియ కోసం 24,643 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారని, కోవిడ్-19 ప్రోటోకాల్ ప్రకారం ఎన్నికల ప్రక్రియ జరగేలా పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేశామని కలెక్టర్, ఎస్.ఈ.సి. కి తెలిపారు. ఎస్పీ భాస్కర్ భూషణ్ తో కలిసి జిల్లాలో పారదర్శకంగా ఎన్నికలు జరగడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రజలు పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు వేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఈ సమీక్షా, సమావేశంలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డా. ఎన్.ప్రభాకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ( రెవెన్యూ) హరేంధిర ప్రసాద్, గూడూరు సబ్ కలెక్టర్ గోపాల కృష్ణ, డి.పి.ఓ శ్రీమతి ధనలక్ష్మి, జెడ్.పి. సి.ఈ.ఓ శ్రీమతి సుశీల, ఆర్.డి.ఓ లు, నోడల్ అధికారులు, జిల్లా అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.
Comments are closed.