The South9
The news is by your side.
after image

సంక్షేమాభివృద్ది వైపు మా అడుగులు : ఎమ్మెల్యే మేకపాటి.

*సంక్షేమాభివృద్ది వైపు మా అడుగులు : ఎమ్మెల్యే మేకపాటి*

*: పార్టీలో చేరిన వారిని సాదరంగా ఆహ్వనించిన ఎమ్మెల్యే*

 

రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలో ప్రతి గ్రామాన్ని, ప్రతి కుటుంబాన్ని సంక్షేమాభివృద్ది వైపు నడిచేందుకే మా అడుగులు అని, మా వెంట నడిచేందుకు ప్రతిపక్ష పార్టీల నాయకులు సైతం మా పార్టీలో చేరుతున్నారని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు.

Post Inner vinod found

శుక్రవారం మండల కేంద్రమైన అనంతసాగరంలో ఇటివల వైఎస్సార్సీపీలో చేరిన సడ్డా రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో సుమారు 100 కుటుంబాలకు చెందిన టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీలోకి చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి వారందరికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.

 

అనంతరం ఎమ్మెల్యే మేకపాటి మాట్లాడుతూ పార్టీలో చేరిన వారు రానున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొనాలని సూచించారు. అభివృద్ది, సంక్షేమాన్ని అందిస్తున్న జగన్ సర్కార్ కు మద్దతు తెలపాలని అన్నారు. అభివృద్ది వైపే మన ప్రభుత్వం అడుగులు వేసిందని, సంక్షేమం దిశగా సాగిందని, అందుకోసమే జగన్ పార్టీలో చేరికలు జరుగుతున్నాయని అన్నారు.

 

అందరం సమిష్టిగా కృషి చేసి మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గెలిపించుకుందామని, వైఎస్సార్సీపీ సంక్షేమ ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆదరించేలా ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Post midle

Comments are closed.