The South9
The news is by your side.
after image

అశ్లీల అసంబద్ధ కంటెంట్ ను ప్రసారం చేస్తున్న ఓ టి టి, సోషల్ మీడియా ల పై చర్యలు కఠినతరం కావాలంటే ప్రత్యేక చట్టం కావాల్సిందే.. సుప్రీం కోర్ట్

ఢిల్లీ : ఓ టి టి, సామాజిక మాధ్యమాల, కట్టడికి కేంద్రం తీసుకున్న నిబంధనలు సరిగా లేవని సుప్రీంకోర్టు శుక్రవారం నాడు వ్యాఖ్యానించింది. అమెజాన్ ప్రైమ్ ఓ టి టి లో ప్రసారమవుతున్న’ తాండవ్’ వెబ్ సిరీస్ కి సంబంధించి న దాఖలైన పిటిషన్ని విచారించే సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం. అమెజాన్ ప్రైమ్ ఇండియా హెడ్ అపర్ణ పురోహిత్ అరెస్ట్ నుంచి తాత్కాలిక రక్షణ కల్పిస్తూ జస్టిస్ అశోక్ భూషణ్ జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి ల ధర్మాసనం పేర్కొంది అలానే అపర్ణ పురోహిత్ వేసిన బెయిల్ పిటిషన్ పై స్పందించాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా… అశ్లీల , అతి హింస, కంటెంట్ ల ఎక్కువగా ప్రసారం చేసే ఓటీటీ లపై శిక్ష విధించే ప్రతిపాదనలు సరిగా లేవని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై తీసుకునే చర్యలేవి స్పష్టంగా అందులో పొందుపరచ లేదని సుప్రీం కోర్ట్ వ్యాఖ్యానించింది. అలానే ప్రత్యేక చట్టం లేకుండా , వీటిని నియంత్రించడం అసాధ్యమని పేర్కొంది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన సూచనలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

Post midle

Comments are closed.