తెలంగాణ ప్రతినిధి : భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 2024 లో అధికారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే ఉద్దేశంతో తమ మార్క్ చతురతను ప్రదర్శిస్తుంది. గత కొంత కాలం క్రితమే తెలంగాణలో భారీ బహిరంగ సభలతో, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లు తమ బల ప్రదర్శన నిర్వహించారు. ఈ సభలతో తెరాస పార్టీకి బలమైన ప్రతిపక్షంగా, భారతీయ జనతా పార్టీ అనే ఉద్దేశాన్ని కార్యకర్తల్లో నింపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన బలమైన నాయకుడైన కొండ విశ్వేశ్వర్ రెడ్డిని భారతీయ జనతా పార్టీలోకి చేర్చుకోవడంతో బిజెపి ఆంతర్యం అర్థం అవుతుంది. తెలంగాణలో బలమైన నాయకులని భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించి తద్వారా బలమైన శక్తికి గా ఎదగాలని వ్యూహంతో తో ఉన్నారు బిజెపి పెద్దలు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రస్తుత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం తో పాటు, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడం జరిగింది. అయితే రాజీనామా అనంతరం ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నానని రాజగోపాల్ రెడ్డి చెప్పకొచ్చారు. ఏ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకోలేదని చెప్పడం కోసమెరుపు. ఏది ఏమైనా ,భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ తెలంగాణలో భాగంగా రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడని రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
Comments are closed.