రేవంత్ మంత్రు ల్లో ఒకరు డ్రాప్…. ఐదుగురికి ఛాన్స్…. హై కమాండ్ చాయిస్
తెలంగాణ: ప్రతినిధి south9
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. కాంగ్రెస్ హై కమాండ్ ఈ మేరకు సీఎం రేవంత్ కు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో ఖాళీ భర్తీతో పాటుగా ఒక మంత్రికి ఉద్వాసన, శాఖల మార్పు ఖాయమని సమాచారం. సి డబ్ల్యూ సి సమావేశానికి హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్తున్న రేవంత్ తుది జాబితా పైన చర్చించనున్నారు. అదేవిధంగా నామినేటెడ్ పదవుల భర్తీపైన ఈ పర్యటనలో పైన నిర్ణయం జరిగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. సిడబ్ల్యుసి సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరుకానున్నారు. ఆ తర్వాత పార్టీ అధినాయకత్వంతో సమావేశం అవుతారు.ఈ భేటీలో మంత్రివర్గ విస్తరణ పైన తుది చర్చలు జరగనున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులోగా మంత్రివర్గ విస్తరణ పూర్తి చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సమాయత్వం చేయాలని రేవంత్ భావిస్తున్నారు. ఈమెరకు ఇప్పటికే హై కమాండ్కు నివేదికలు ఇచ్చారు. దీంతో దీపావళి ముందే మంత్రివర్గవిస్తరణ ఖాయమని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. రేవంత్ ప్రస్తుతం ఉన్న మంత్రులు ఒకరిని తొలగించడం ఖాయమని తెలుస్తోంది. మంత్రి సురేఖ వ్యవహారశైలి పైన పార్టీ అధినాయకత్వం ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. నాగార్జున కుటుంబం పైన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు,మంత్రిగా ఉంటూ సొంత పార్టీ నేతలతో వైరం, పోలీస్ స్టేషన్లకు వెళ్లడం, సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఢిల్లీ దాకా వచ్చి ఫిర్యాదు చేయటాన్ని పార్టీ తీవ్రంగా పరిగణిస్తుంది. సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించడం ఖాయమని అభిప్రాయం పార్టీ ముఖ్యనేతల్లోవినిపిస్తోంది. అదే సమయంలో కొత్తగా ఐదుగురికి మంత్రివర్గంలో అవకాశం దక్కడం ఖాయమైనట్టు సమాచారం. సామాజిక సమీకరణాలను పరిగణలోనికి తీసుకొని ఐదుగురు ఎంపికపైన రేవంత్ తో భేటీ సమయంలో నిర్ణయం జరగనుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి సీనియర్ నాయకుడు అయిన ప్రేమ్ సాగర్ రావు తో పాటు వివేక్ వినోద్ సోదరులు రేసులో ఉన్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం తాజాగా రేసులో ముందుగా ఉన్నారు. ఆయన సోదరుడు మంత్రిగా ఉండడంతో రాజగోపాల్ కు ఇప్పుడే ఛాన్స్ ఇస్తారా లేదా అనేది చూడాలి. రంగారెడ్డి నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డిలో ఒకరికి మంత్రి పదవి ఖాయమని చెప్తున్నారు.ముదిరాజు వర్గానికి మంత్రివర్గంలో అవకాశం వస్తే మహబూబ్నగర్ శ్రీహరి పేరు రేసులో ఉంది. వారం రోజుల్లో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఖాయమని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. దీంతో ఎవరికీ ఛాన్స్ దక్కుతుందనేది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది.
Comments are closed.