The South9
The news is by your side.
after image

రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న సుధీర్ బాబు హీరోగా వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న ‘హంట్’ విడుదల

*రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న సుధీర్ బాబు హీరోగా వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న ‘హంట్’ విడుదల*

 

నైట్రో స్టార్ సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా ‘హంట్’. మహేష్‌ దర్శకత్వం వహించారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఈ రోజు నిర్మాత వెల్లడించారు.

‘హంట్’ విడుదల తేదీని వెల్లడిస్తూ… సినిమా కొత్త పోస్టర్ విడుదల చేశారు. సుధీర్ లుక్ & కళ్ళలో ఇంటెన్సిటీ ప్రేక్షకులను అట్ట్రాక్ట్ చేస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. సుధీర్ బాబుతో పాటు శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ భరత్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్లుగా కనిపించనున్నారు.

 

నిర్మాత వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ “మా ‘హంట్’ సినిమాను జనవరి 26న థియేటర్లలో విడుదల చేస్తున్నాం. రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకులు అందరినీ సినిమా అలరిస్తుంది. చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నీ పూర్తి అయ్యాయి. సినిమా రెడీగా ఉంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాం. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన పలు చిత్రాలకు వర్క్ చేసిన రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ ‘హంట్’లో స్టంట్స్ కంపోజ్ చేశారు. ‘జాన్ విక్ 4’కి కూడా వాళ్ళే స్టంట్ కొరియోగ్రాఫర్స్. వాళ్ళు యాక్షన్ కొరియోగ్రఫీ సినిమాకి హైలైట్ అవుతుంది. ఆల్రెడీ విడుదలైన టీజర్, ‘పాపతో పైలం…’ పాటకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్‌లో ట్రెండ్ అయ్యాయి. త్వరలో ట్రైలర్ విడుదల తేదీ వెల్లడిస్తాం” అని అన్నారు.

 

Post Inner vinod found

‘హంట్’ సినిమాలో నటీనటులు:

సుధీర్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, భరత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మైమ్ గోపి, కబీర్ దుహన్ సింగ్, మౌనిక రెడ్డి, గోపరాజు రమణ, మంజుల ఘట్టమనేని, చిత్రా శుక్ల, సుపూర్ణ మల్కర్, సంజయ్ స్వరూప్, రవి వర్మ, ‘జెమినీ’ సురేష్, అభిజీత్ పూండ్ల, కోటేష్ మన్నవ, సత్య కృష్ణన్ తదితరులు ఇతర తారాగణం.

 

‘హంట్’ సినిమా సాంకేతిక వర్గం :

Post midle

ఆర్ట్ డైరెక్టర్ : వివేక్ అన్నామలై, కాస్ట్యూమ్ డిజైనర్ : రాగ రెడ్డి, యాక్షన్ : రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ , స్టంట్స్ : వింగ్ చున్ అంజి, ఎడిటర్ : ప్రవీణ్ పూడి, సినిమాటోగ్రఫీ : అరుల్ విన్సెంట్‌, సంగీతం : జిబ్రాన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : అన్నే రవి, నిర్మాత : వి. ఆనంద ప్రసాద్, దర్శకత్వం : మహేష్.

Post midle

Comments are closed.