మీడియాను ఎవరూ అడ్డుకోలేరు…
_సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
_న్యూ ఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో జరగిన చర్యల నుంచి మీడియా ను నియంత్రించ లేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యా నించింది._
_ఎన్నికల కమీషన్ వేసిన పిటీషన్ పై సోమవారం విచారణ అనంతరం దేశ అత్యున్నత న్యాయస్థానం పై విధంగా వ్యాఖ్యా నించింది._
_ప్రజాస్వామ్య నాలుగు మూలస్థంభాల్లో మీడియా ఒకటని కోర్టుల్లో జరిగే విషయాలను ప్రజలతో మీడియా కమ్యూనికేట్ చేయగలదని జస్టిస్ వై.వి. చంద్రచూడ్,జస్టిసాలతో కూడాన బెంచ్‌లో కూడిన సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది._
_కొద్దిరోజుల క్రితం ఎన్నికల ర్యాలీల విషయమై మద్రాస్ హైకోర్టు స్పందిస్తూ “మీపై హత్యానేరం ఎందుకు మోపకూడదు?” అంటూ కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్రంగా విరుచుకపడ్డ విషయం తెలిసిందే._
_అయితే మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యల పై సుప్రీం గడపను ఈసీ తొక్కింది._
_అనంతరం సుప్రీం స్పందిస్తూ “కోర్టుల్లో ఏం జరిగిందన్న విషయాన్ని మీడియా పూర్తి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది._
_కోర్టులకు సంబంధించిన అంశాలను ఇది రిపోర్టు చేయజాలదని అనలేం._
_మీడియా చాలా శక్తివంతమైంది…
_అందుకే ప్రతి వ్యవస్థను ప్రజలతో అనుసంధానం చేసే సాధనం మీడియా అని అందుకే దానిని నియంత్రించలేమని” సుప్రీం ధర్మాసనం పేర్కొంది…!!_
Comments are closed.