*రేపటి అసెంబ్లీ,కౌన్సిల్ గ్యాలరీల్లోకి మీడియా, అధికారులు ఎవరికీ అనుమతి లేదు*
*భారత ఎన్నికల సంఘం జారీ చేసిన అథారిటీ లెటర్స్ ఉన్న మీడియాకు అసెంబ్లీ ప్రాంగణంలోని నిర్దేశిత ప్రదేశం వరకు అనుమతి*
*4వ బ్లాకు పబ్లిసిటీ సెల్ నుండి యధావిధిగా అసెంబ్లీ,కౌన్సిల్ సమావేశాల లైవ్ కవరేజ్*
*రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి*
ఈనెల 23 వతేదిన గురువారం ఉదయం 9గం.ల నుండి సాయంత్రం 4గం.ల వరకు అసెంబ్లీ భవనంలో ఎంఎల్ఎ కోటా ఎంఎల్సి ఎన్నికలు జరగనున్న దృష్ట్యా అసెంబ్లీ, కౌన్సిల్ మీడియా గ్యాలరీల్లోకి మీడియాకు అనుమతి లేదని ఎంఎల్సి ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు శాసన మండలి సంయుక్త కార్యదర్శి పివి సుబ్బారెడ్డి తెలియ జేశారు.అలాగే అధికారుల గ్యాలరీల్లోకి కూడా అధికారులు ఎవరికీ అనుమతి లేదని ఆయన తెలియజేశారు.
కావున ఈవిషయాన్ని మీడియా మిత్రులు అందరూ గమనించి రేపటి అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాల కవరేజ్ నిమిత్తం అసెంబ్లీ భవనంకు వద్దకు రావద్దని తెలియజేయడ మైనది.
యదావిధిగా 4వ బ్లాకు పబ్లిసిటీ సెల్ నుండి అసెంబ్లీ,కౌన్సిల్ సమావేశాల లైవ్ కవరేజ్ చేయబడుతుంది.
ఎంఎల్సి ఎన్నికల కవరేజ్ నిమిత్తం మీడియా ప్రతినిధులకు భారత ఎన్నికల సంఘం వారు జారీ చేసిన అథారిటీ లెటర్స్(పాస్ లు)కలిగిన మీడియా ప్రతినిధులను అసెంబ్లీ ప్రాంగణం లోని నిర్దేశిత ప్రదేశం వరకు అనుమతించడం జరుగుతుంది.
Comments are closed.