తేదీ: 08-04-2022,
అమరావతి.
*ఆటోనగర్ లపై బలవంతం లేదు..దుష్ప్రచారం తగదు : ఏపీఐఐసీ*
*పత్రికలు, ఎలక్ట్రానిక్ , సోషల్ మీడియాలో ఆటోనగర్లపై వస్తున్న అసత్య వార్తలను ఖండించిన ఏపీఐఐసీ*
*జీవో నంబర్ 5,6లు పారిశ్రామికవేత్తలకు ఉపశమనం, వెసులుబాటు మాత్రమే*
*పారదర్శకతే ధ్యేయంగా ఏపీఐఐసీ ఇటీవల 14 ఆన్ లైన్ సేవల ప్రారంభం*
అమరావతి, ఏప్రిల్, 08; కొన్ని పత్రికలు, మీడియా ఛానళ్ళు, సోషల్ మీడియాలో ఇటీవల ప్రభుత్వం ఆటోనగర్ లపై తీసుకున్న నిర్ణయానికి సంబంధించి చేస్తోన్న దుష్ప్రచారాన్ని ఏపీఐఐసీ ఖండించింది. ఆటోనగర్ లు ఏర్పడిన నాటి నుంచి ఎన్నో ఏళ్ళుగా అక్కడ పేరుకుపోయిన ఇబ్బందులను పారిశ్రామికవేత్తల ద్వారా తెలుసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక,మౌలిక వసతుల సదుపాయాల సంస్థ(ఏపీఐఐసీ) కల్పించిన వెసులుబాటును తప్పుదోవ పట్టించడం సరికాదని స్పష్టం చేసింది. ఆటోనగర్ లను బహుళ ప్రయోజనాలకు వినియోగించుకోవడం అనే ఏపీఐఐసీ నిర్ణయాన్ని తెలియపరచే జీవో నంబర్ 5,6 ల సారాంశం కేవలం ఒక అవకాశం మాత్రమేనని వెల్లడించింది. ఈ విషయంలో పారిశ్రామికవేత్తలెవరికీ ఎటువంటి ఒత్తిడి, బలవంతానికి ఆస్కారం లేదని పేర్కొంది. కానీ, నిబంధనలకు విరుద్ధంగా, చట్ట వ్యతిరేకంగా ఆటోనగర్ లలో పరిశ్రమలకు కేటాయించిన స్థలాలు అనుమతి లేకుండా మార్చడం సరికాదంది. కచ్చితంగా ఏపీఐఐసీ అనుమతి తీసుకోవాలని , అలా తీసుకోని వారికి ఇప్పటికే నోటీసులు పంపినట్లు ఏపీఐఐసీ వివరించింది.
ఎవరైతే పరిశ్రమలను వివిధ కారణాలతో నడపలేక, ఆర్థికంగా చితికి, బ్యాంకుల నుంచి రుణాలు అందక సదరు పరిశ్రమలను నడపలేని స్థాయిలో ఉన్నవారు తిరిగి పురోగమించేలా ఈ వెసులుబాటు కల్పించిందని , ఇందులో ఎటువంటి దురుద్దేశాలకు తావు, ఆస్కారం లేవని తేల్చి చెప్పింది. పారదర్శకంగా ప్రతి ఒక్క పారిశ్రామికవేత్తకు మంచి జరిగేలా గతంలో ఇబ్బందులు అధిగమించి, తిరిగి పురోగమించే అవకాశం కలిగించే దిశగా మానవీయ కోణం, కచ్చితమైన ఏపీఐఐసీ,పరిశ్రమల శాఖ కచ్చితమైన ఆలోచనలకు ప్రతిరూపమే జీవో నంబర్ 5,6 అని తెలిపింది. ఆటోనగర్ లే కాకుండా పారిశ్రామికవేత్తలకు ఏ అవసరమైనా, ఎలాంటి విషయమైనా పారదర్శకతకు పెద్దపీట వేసేలా ఏపీఐఐసీ 14 సేవలను ఆన్ లైన్ చేస్తూ ఇటీవల ప్రారంభించిన సంగతిని కూడా గుర్తు చేసింది.
*నూతన పాలసీ యొక్క ఆవశ్యకత*
దశాబ్దాల క్రితం ఏర్పాటు చేయబడిన ఆటోనగర్ ఏరియా అర్బన్ ప్రాంతము అభివృద్ధి జరుగుతున్నందున ఆటోనగర్లోని సర్వీస్ యూనిట్లు, ట్రాఫిక్ మరియు కాలుష్య ప్రభావము వలన పారిశ్రామికవేత్తలు తమ యూనిట్లు నడపలేకపోవుచున్నందున ఈ పాలసీని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. భవిష్యత్తులో ఆటోనగర్ లో ఇండస్ట్రియల్ యాక్టివిటీ నడుపుట సాధ్యం కానందున, ప్రభుత్వము భూమి వినియోగమార్పిడి చేయుటకుగాను నూతన విధానము అమలుపరచుటకు విధాన నిర్ణయంతో వెసులుబాటు కల్పించింది.
*మరింత స్పష్టత కోసం..నూతన విధానము అమలు తీరు వివరాలు*
1. ఆటోనగర్లు పారిశ్రామిక ఎస్టేటులుగా రవాణా , లాజిస్టిక్స్ డిజైన్ చేయుచూ జిల్లా కేంద్రములు మేజర్ పట్టణములకు రవాణా సదుపాయములు కేటాయించుట.
2. ఆటోనగర్లను రీ-ఆర్గనైజ్ చేయుచూ కార్యాలయములు, ట్రాన్స్పోర్ట్ చేయు కంపెనీలకు, గోడౌన్లకు స్పేస్, కంపెనీల విస్తరణ, పార్కింగ్ ఏరియా, లోడింగ్ / అప్లోడింగ్ సందర్భములను తగ్గించుటకు వాహనముల రిపేర్లు, సర్వీసింగ్, విశ్రాంతి స్థలములు, షాపులు, గోడౌనులు ఉండుటవలన పార్కింగ్, పనికిరాని ట్రక్స్ పార్కింగ్ నిరోధించుట.
3. నివాస ప్రాంతములో ఉన్న ఇండస్ట్రియల్ యూనిట్లను కొనసాగించుటకు బదులుగా యితర వినియోగముల కొరకు మార్పు చేయుటకు గల ఆటోనగర్లను గుర్తించుట.
4.ప్రస్తుతము అర్బన్ ఏరియాలో ఉన్న ఆటోనగర్లను రద్దీలేని, ప్రజలకు ఇబ్బంది కలగని శివార్లలో తిరిగి ఏర్పాటు చేయుటకు భూమిని గుర్తించుట.
5. ప్రస్తుతము ఆటోనగర్ ను బహుళ ప్రయోజనములుగా వినియోగించుటకు మార్పు చేయుట.
6. ప్రస్తుతము ఉన్న ఇండస్ట్రియల్ యూనిట్లను నడుపుచున్న పారిశ్రామివేత్తలు ఎవరైనా కమర్షియల్, బిజినెస్ మరియు యితరములకు మార్పు చేయుట కొరకు ధరఖాస్తు చేసిన యడల మాత్రమే భూమి మార్కెట్ విలువ పై 50 శాతం ఫీజు కన్వర్షన్ కొరకు ధరఖాస్తు చేసుకున్న వారు చెల్లించవలసియున్నది.
7.సదరు ధరఖాస్తులు ఎ.పి.డి.పి.ఎమ్.ఎస్. ద్వారా ఆన్లైన్లో ధరఖాస్తు చేసుకున్న యడల ఆన్లైన్లోనే అనుమతులు ఉత్తర్వులు యిచ్చుటకు ప్రభుత్వం అనుమతించియున్నది.
8. భూమి మార్పిడి అనుమతించిన 3 నెలల లోపు సదరు ఫీజు చెల్లించవలసి ఉన్నది. అట్లు చెల్లించనని యదల అనుమతుల ఉత్తర్వులు రద్దు చేయబడును.
*కావున రన్నింగ్లో ఉన్న పరిశ్రమలు / పారిశ్రామికవేత్తలు, కన్వర్షన్ కోరని వారు ఎటువంటి ఫీజులు చెల్లించవలసిన అవసరం లేదు. 50 శాతం భూమిని తిరిగి ఏ.పి.ఐ.ఐ.సి. వారికి అప్పగించవలసిన అవసరమూ లేదు.*
——————-
Comments are closed.