లక్నో: పేరొందిన రౌడీషీటర్ ను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై ముఠా కాల్పులకు తెగబడడంతో ఒక డీఎస్పీ సహా ఎనిమిది మంది పోలీసులు చనిపోయారు.
కాన్పూర్ లో రౌడీ షీటర్ వికాస్ దూబేను పట్టుకునేందుకు వెళ్ళిన పోలీసుల మీద రౌడీ మూకల కాల్పులు జరిపారు. భవనంపై నుంచి కాల్పులు జరపడంతో డీఎస్పీ దేవేంద్ర మిశ్రా సహా 8 మంది పోలీసుల మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటిచింది. వీరితో పాటు నలుగురు గాయపడ్డారు.
పోలీసులు తేరుకునేలోపు సంఘటనా స్థలం నుంచి రౌడీ మూకలు పారిపోయాయి.
రౌడీ షీటర్ వికాస్ దూబే పై 60 కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈలోపు అదనపు బలగాలు ఆ ప్రాంతానికి చేరుకుని అగంతకుల కోసం జల్లెడ పడుతున్నాయి. పోలీసుల మృతి ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. పోలీసులపై కాల్పులకు పాల్పడిన రౌడీ మూకను అణిచివేయాలని డీజీపీ హెచ్.సీ.అవస్థిని సీఎం యోగి ఆదేశించారు.
Comments are closed.