The South9
The news is by your side.
after image

విపత్కర సమయంలో వ్యాపారం చేస్తున్న నెల్లూరు నయా డాక్టర్ దేవుళ్ళు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది అత్యధికంగా 2 లక్షలు పైచిలుకు కేసులు నమోదు కావడం అంటే కరోనా
ఎంత తొందరగా విస్తరిస్తుంది అర్థం చేసుకోవచ్చు. అలానే ఇరు తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకి కేసులు ఎక్కువుగా నమోదు అవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ని నెల్లూరులో 1300 వందల కేసులు నమోదు అవడంతో తెలీయని ఒక భయానక పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో నెల్లూరుకు చెందిన కొంత మంది డాక్టర్లు జేబులు నింపుకునేందుకు ఏమాత్రం సిగ్గు శరం లేకుండా వ్యవహరిస్తున్నారు. మేము అందరినీ విమర్శించడం లేదు. ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో మానవత్వం మరచి కర్కటం గా వ్యవహరిస్తున్న కొంతమంది తీరును మాత్రమే విమర్శిస్తున్నాం. గత కరోనా లో ఇబ్బంది పడ్డ సామాన్య జనాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పరిస్థితుల్లో మరల కరొన విలయ తాండవం చేయడం తో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఒకపక్క బెడ్లు దొరక్క ఇబ్బంది పడుతుంటే మరోపక్క ఆక్సిజన్ ల కొరత బూచిగా చూపించి వేలకు వేలు దండుకుంటున్నారు. కరోనా పేషెంట్ కి చికిత్స చేయడం గొప్ప విషయం దానిని ఎవరూ కాదనరు. అందుకనే కదా డాక్టర్ల ను దేవుళ్లతో పోలుస్తారు . కానీ ఇప్పుడు బిల్లులు కట్టలేక తల్లడిల్లిపోతున్నారు సామాన్యులు. అనధికారికంగా కరోనా పేషెంట్ లకు చికిత్స అందిస్తున్న టువంటి హాస్పిటల్స్, రోజుకి ఇరవై ఐదు వేలు వసూలు చేస్తున్నారు. అలానే మందులు ఆక్సిజన్ ఇతరత్రా ఇంకో ఇరవై ఐదు వేల రూపాయలు బిల్లులు వేస్తున్నారు. కరోనా పేషెంట్ లకు వాడే ముఖ్యమైన ఇంజక్షన్ రెమిడి సివర్ ఇంజక్షన్ ని బయట మార్కెట్ లో 30 వేల రూపాయలకు అమ్ముతున్నారు. ఈ విషయం బయటకు పొక్కడంతో విజిలెన్స్ అధికారులు తనిఖీ చేపట్టి కొంతమంది దళారులు కూడా పట్టుకోవడం జరిగింది. అయితే ఈ దోపిడిని అరికట్టి సామాన్యులకు అందుబాటులోకి వైద్యం చేయించాలంటే జిల్లా కలెక్టర్, మరియు మంత్రులు ఉన్నతాధికారులు, వీటిపై నిఘా పెట్టి సామాన్య ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యపై ఒక పరిష్కార దిశగా ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.

Post midle

Comments are closed.