SPS నెల్లూరు జిల్లా,
నేర సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా యస్. పి. విజయ రావు,IPS
జిల్లాలో చోటు చేసుకున్న గ్రేవ్, నాన్ గ్రేవ్, అస్తి సంబంధిత నేరాలలో రికవరీల గురించి సర్కిల్ వారీగా అధికారులతో సమీక్ష నిర్వహణ.
హత్య కేసులలో విచారణ వేగవంతం చేయాలని ఆదేశం. .. వేరొకరి ప్రాణాలు హరించే హక్కు ఎవరికీ లేదు.. అటువంటి వారికి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి….
శాంతి భద్రతలను పరిరక్షించి – చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిరోదించి – ప్రజాజీవణ విధానంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పడం మన భాధ్యత.
*రోడ్డు ప్రమాదాలను తగ్గించాలి.. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయండి.. ప్రజలకు అవగాహన కల్పించండి..*
రోడ్ సేఫ్టీ లో భాగంగా జోనల్ హైవే మొబైల్స్ సేవలు సక్రమం గా వినియోగించాలని , ఐరాడ్ (iRAD) అప్లికేషన్ నందు రోడ్డు ప్రమాదాల వివరాలను ఎప్పటికప్పుడు పొందుపరచాలని సూచనలు.
రాంగ్ రూట్ లో వచ్చు వాహనాలపై, ఓవర్లోడ్, ట్రిపుల్ రైడ్, హెల్మెట్ లేకుండా మరియు రోడ్డు నిబంధనలు పాటించని వాహనదారులపై E చలాన ద్వారా జరిమానా విధించాలని ఆదేశాలు.
శాంతి భద్రతలను పరిరక్షించి – చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిరోదించాలి
దర్యాప్తులో వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటూ సాంకేతికతను ఉపయోగించుకొని సమర్థవంతమైన నేర దర్యాప్తు చేసి కేసులను త్వరితగతిన ఛేదించాలి
అపరిష్కృతంగా ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి.
నాటు సారా రహిత జిల్లానే లక్ష్యంగా SEB అధికారులతో కలిసి పోలీసు అధికారులందరు నిర్దేశిత కార్యాచరణతో ముందుకు సాగాలని ఆదేశాలు.
సైబర్ నేరాల కేసులను రిజిస్టర్ చేసి, ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశాలు
ఎర్ర చందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలి.. జిల్లా యస్.పి. గారు.
*మహిళలు, పిల్లల ఫిర్యాదులకు మొట్ట మొదటి ప్రాదాన్యత ఇవ్వాలి. అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదు..*
దొంగతనాలను అరికట్టడానికి ప్రత్యేక క్రైమ్ బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశం..
SOS కాల్స్ వచ్చిన వెంటనే స్పందించి, సంఘటనా స్థలానికి చేరుకోవాలి.
నిజాయితి, నిబద్దతతో విధులు నిర్వహించాలి. అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవు
ఫ్రెండ్లీ, విజబుల్ పోలీసింగ్ అమలు చేయాలి..
గత మాసంలో దర్యాప్తు పెండింగులో ఉన్న కేసులను తగ్గించుటలోను, ఉప ఎన్నికలు, దిశ యాప్ రిజిస్ట్రేషన్, ఇతర విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు మెమెంటొలు, ప్రశంసా పత్రాలను అందించిన యస్.పి.
Comments are closed.