నెల్లూరు ప్రతినిధి : భారీ వర్షాలకు కడప చిత్తూరు నెల్లూరు జిల్లాలు తల్లడిల్లి పోతున్నాయి. నగరం , గ్రామాల్లో చాలావరకు వరద నీరు రావడంతో ప్రజలు పునరావాస ప్రాంతాలకు వెళ్లి తలదాచుకుంటున్నారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లా ముదివర్తి పాలెం, అనంతసాగరం , సోమశిల ప్రాంతాల్లో వరద నీరు భారీగా చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలానే నెల్లూరు పెన్నా నది పరివాహక ప్రాంతాలైన పోతిరెడ్డి పాలెం, వెంకటేశ్వరపురం, తదితర ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో ప్రజలు స్థానికంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్నారు. అయితే జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పునరావాస కేంద్రం దగ్గరికి వెళ్లి, అక్కడ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. పునరావాస కేంద్రంలో ప్రజలతో మాట్లాడుతూ ఏదైనా ఇబ్బందులు ఉంటే తెలియజేయాలని అన్నారు. అక్కడ ఉన్న వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. ఇక చెన్నై గూడూరు జాతీయ రహదారి రాకపోకలకు కాస్త ఇబ్బందిగానే ఉన్నట్లు తెలుస్తుంది.
Comments are closed.