The South9
The news is by your side.
after image

మైతోమానియా సిండ్రోమ్ తో బాధపడుతున్న నారా లోకేష్ :మేకపాటి విక్రమ్ రెడ్డి

post top

*టీడీపీ వారు ప్రజలకు మీరేం చేశారో వివరించి ఆ తరువాత మాట్లాడండి : ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*

*: మైతోమానియా సిండ్రోమ్ తో బాధపడుతున్న నారా లోకేష్* 

*: అర్థం లేని ఆరోపణలు చేసిన మీరు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి*

*: రెండు నెలల్లో ఎంఎస్ఎంఈ పార్కులో తొలి పరిశ్రమ*

 

*రాష్ట్రంలో దుర్మార్గపాలన జరుగుతోందని, ప్రజలకు సంక్షేమం అందడం లేదని, ఆత్మకూరు నియోజకవర్గంలో అభివృద్ది జరగలేదని విమర్శలు చేసే ముందు గతంలో మీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేశారో ప్రజలకు వివరించి ఆ తరువాతే మా గురించి మాట్లాడితే బాగుంటుందని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు.*

 

*ఆదివారం నెల్లూరులోని మేకపాటి క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఆత్మకూరు నియోజకవర్గంలో జరిగిందని, ప్రధాన ప్రాంతాలు కాకుండా అటవీ ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించి వెళ్లిపోయారని, వెళ్లిపోతూ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎవరో రాసిచ్చిన స్క్రీప్ట్ చదివి వెళ్లిపోయారన్నారు.*

 

*నారా లోకేష్ బహిరంగ సభ ప్రారంభ ఉపన్యాసంలో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మైతో మానియా సిండ్రోమ్ ఉందంటూ వ్యాఖ్యలు చేశారని, అసలు అది ఏమిటో మేము కూడా కనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని, లేని విషయాన్ని పదే పదే చెప్పి నమ్మించడమే కాకుండా తాను కూడా నమ్మడమే ఈ వ్యాధి లక్షణమని, ఇలాంటిది మా ముఖ్యమంత్రికి లేవన్నారు.*

 

Post midle

*టీడీపీ పాదయాత్రలో మీరు ఆత్మకూరు అభివృద్ది జరగలేదని, అవినీతి జరుగుతుందని పలు రకాల విమర్శలు చేస్తున్నారని, ఎవరో చెప్పినవి చదివి వినిపించకుండా, నిజాలు తెలుసుకుని మాట్లాడాలని, పక్కనున్న నాయకులు చెప్పి చెప్పి వారి మాటలనే విశ్వసించి మీరే మైతో మానియా సిండ్రోమ్ తో బాధపడుతున్నారన్న విషయం ప్రజలకు తెలిసిపోయిందని అన్నారు.*

 

*సంక్షేమ పాలన అందచేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కన్నింగ్ అంటూ విమర్శలు చేస్తున్నారని, 2014, 2019 మీ మెనిఫెస్టో తీసుకొచ్చి ఏం పనులు చేశారో, ఏం హామిలిచ్చారో ప్రజలకు వివరించాలని, 2019లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మెనిఫెస్టో మేము వివరిస్తామని అప్పుడు ఎవరు కన్నింగో ప్రజలే చెబుతారన్నారు. గెలుపే లక్ష్యంగా పెట్టుకుని అమలు చేయలేని హామిలు ఇస్తున్న మీరు కన్నింగ్ అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.*

 

*మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆత్మకూరు అభివృద్ది, అవినీతి అంటూ తీవ్ర విమర్శలు చేశారని, గతంలో మీరు చేసిన పనుల ప్రజలందరికి తెలుసునని, అర్థం లేని ఆరోపణలు చేస్తున్న మీరు ఆత్మకూరు ప్రజలకే కాకుండా రాష్ట్ర ప్రజలకే క్షమాపణ చెప్పాల్సి ఉంటుందన్నారు.*

 

*ఆత్మకూరు అభివృద్ది చేశామని, రెండో రోడ్లు ఏర్పాటు చేశామని చెప్పుకొస్తున్నారని, ఆ రెండు రోడ్లు జాతీయ రహదారులను కేంద్ర ప్రభుత్వం వీటి నిర్మాణం చేపట్టడం జరిగిందని వివరించారు. హైలెవల్ కెనాల్ నిర్మాణం, అభివృద్ది చేశామని మీరు చెప్పుకుంటున్నారని, ఆ ఆలోచన మా తండ్రి, అప్పటి నరసారావుపేట ఎంపీగా ఉన్న సమయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి మెట్టప్రాంతాల అభివృద్ది కోసం దీనిని ప్రారంభించారన్నారు.*

 

Post Inner vinod found

*2009 నుండి 2014 ఆర్థిక మంత్రిగా పనిచేసిన సమయంలో మీరు హైలెవల్ కెనాల్ నిర్మాణ పనులు ఎందుకు శరవేగంగా చేయలేకపోయారాని, అనంతరం కూడా మీరు ఇన్ చార్జిగా వ్యవహరించారని, ఫేజ్-1, ఫేజ్-2 అని విమర్శలు చేస్తున్న మీరు ఫేజ్-1లో పడమటినాయుడుపల్లి గ్రామం, రిజర్వాయర్ ఏర్పాటు ఉందన్న విషయం మీకు తెలుసుకదా వారికి నష్టపరిహారం ఎందుకు అందించలేకపోయారో చెప్పాలన్నారు. డౌన్ స్ట్రీమ్ పనులు ఎందుకు తీసుకున్నారో వివరించాలన్నారు.*

 

*ఆ గ్రామం కాకుండా మరో గ్రామాన్ని ఎంచుకుని ఎందుకు పనులు ప్రారంభించారో చెప్పాలని అన్నారు. అసలు హై లెవల్ కెనాల్ పనులు గత ప్రభుత్వంలో ఎంత మాత్రం జరగలేదన్న విషయం అందరికి తెలుసునన్నారు. ఆ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని, దానిని పూర్తి చేసేది మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అన్నారు.*

 

*ఆనాడు రాష్ట్ర విభజన సమయంలో మీరు ఆర్థికమంత్రిగా వ్యవహరించారని, ఐదు కోట్ల మంది ప్రజలు నష్టపోతారన్న విషయం తెలిసి కూడా మీరు కనీసం స్పందించకుండాపోయారని, పదవిని పట్టుకునే ఉండి ప్రజలందరికి మీరు కూడా అన్యాయం చేశారని, ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. నైతిక విలువలు పాటించి రాజీనామా ఎందుకు చేయలేదని, అనంతరం కూడా ప్రత్యేక హోదా గురించి ఎందుకు ప్రయత్నం చేయలేదని ప్రశ్నించారు.*

 

*ఆయన స్వలాభం కోసం రాష్ట్ర అభివృద్దిని 20 సంవత్సరాలు వెనక్కు నెట్టిన మనిషి, ఆత్మకూరు అభివృద్దిపై విమర్శలు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. పారిశ్రామికంగా ఆత్మకూరు వెనుకబడిందని విమర్శించారని, సెంచూరియన్ కంపెనీ ఆత్మకూరులోని ఎంఎస్ఎంఈ పార్కులో ఏర్పాటు చేసేందుకు సిద్దం కాకపోవడంతోనే రెండు కిలోమీటర్ల దూరంలోనే ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మన ప్రాంతం నుండి కంపెనీ వెళ్లిపోయిందని తీవ్ర విమర్శలు చేస్తున్నారని, వందల కిలోమీటర్ల దూరం వెళ్లిపోలేదన్నారు.*

 

*మీరు ఆత్మకూరు గురించి మాట్లాడాలంటే ఎక్కడైనా తాను సిద్దంగా ఉన్నానని, మీరు ఏ సమయం చెప్పినా నేను డిబెట్ కు సిద్దంగా ఉన్నానని అన్నారు. నారా లోకేష్ ఆత్మకూరు నియోజకవర్గం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఆత్మకూరుకు వచ్చి వెళ్లాలని, అప్పుడే మీకు తెలుస్తుందని, మా ముఖ్యమంత్రి మీద విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్న మీరు ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలతోనే మెనిఫెస్టో ప్రకటించుకున్నారని అన్నారు.*

 

  • *రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో అందరూ ఆలోచించాలని, భోగాపురం ఎయిర్ పోర్టును నిలిపివేస్తే మూడు నెలల ముందు దాన్ని మళ్లీ ప్రారంభించుకున్నామని, కోస్టల్ కారిడర్ అభివృద్ది కోసం 8 పోర్టుల నిర్మాణం జరుగుతుందని, రాష్ట్రంలో నూతనంగా రెవెన్యూ జనరేషన్ కోసం ముఖ్యమంత్ర వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు.*

 

*ఆత్మకూరు నియోజకవర్గంలో పారిశ్రామికంగా అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నామని, ఇప్పటికే మా నియోజకవర్గంలో 3 జాతీయ రహదారులు ఉన్నాయని, రెండు పోర్టుల అనుసంధానం ద్వారా భవిష్యత్తులో పారిశ్రామికంగా అభివృద్ది జరుగుతుందని అన్నారు. ఇప్పటికే నిరుద్యోగ యువత కోసం అనేక జాబ్ మేళాలు నిర్వహించామని, ఈ నెల 24వ తేది ఆత్మకూరు పాలిటెక్నిక్ కళాశాల కేంద్రంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, వచ్చే నెల మొదటి వారంలో మరో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందన్నారు.*

 

*ఆత్మకూరు నియోజకవర్గంలో ఇప్పటికే నిరుద్యోగులు, వారి వివరాలు అన్ని తెలుసుకుని ఉన్నామని, రానున్న కాలంలో వారందరికి అవసరమయ్యే విధంగా శిక్షణ ఇవ్వడంతో పాటు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.*

 

*ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విప్లవాత్మక నిర్ణయాలతో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా ఉన్నాయని, సంవత్సరాలుగా పరిష్కారం కాని చుక్కల భూముల సమస్యను ఒక్క జీఓతో పరిష్కరించారని, ఆత్మకూరు నియోజకవర్గంలో 17 వేల ఎకరాల్లో చుక్కల భూముల సమస్య పరిష్కారమైందని అన్నారు. అంతేకాకుండా జగనన్న సురక్ష పథకం కింద ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలను తెలుసుకుని నెల రోజుల కార్యక్రమంలో వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు.*

 

*ఎంజీఆర్ సంగం, నెల్లూరు బ్యారేజ్ నిర్మాణాలు 2008లో ప్రారంభమైతే ఇన్నాళ్లు మీరు ఇక్కడే ఇన్ చార్జిగా ఉన్నారని, గత ప్రభుత్వ హయాంలో ఎందుకు చేయలేదని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రెండు బ్యారేజ్ లను పూర్తి చేసి ప్రజలకు అందచేశారని అన్నారు. సంగం బ్యారేజ్ ప్రారంభ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన ప్రతి అభివృద్ది పనులకు ప్రతిపాదనలు అన్ని సిద్దమయ్యాయని, త్వరలోనే అవి మంజూరై ప్రారంభించడం జరుగుతుందని అన్నారు.*

 

*నారంపేటలోని ఎంఎస్ఎంఈ పార్కు ద్వారా నూతనంగా పరిశ్రమను రెండు నెలల వ్యవధిలోనే తీసుకొస్తామని, వ్యవసాయ వ్యర్థాలతో ఫర్నిచర్ తయారు చేసే పరిశ్రమను నెలకొల్పతున్నట్లు వివరించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వ్యవసాయాధికారిత ప్రాంతం కాబట్టి హైలెవల్ కెనాల్ నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం సాగు పెరిగే అవకాశముండడంతో వ్యవసాయాధారిత పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.*

 

*ఈనెల 23న ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలో ఎంజీఆర్ ఫౌండేషన్ స్వంత నిధులతో మున్సిపల్ బస్టాండ్ నిర్మాణం ప్రారంభోత్సరం చేయనున్నామని వివరించారు. తాను శాసనసభ్యునిగా ఎన్నికై జూన్ 23 నాటికి ఒక సంవత్సరం పూర్తవుతుందని, ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ది ఏ విధంగా చేశానో మీరంతా చూశాారని, ప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులందరి మద్దతుతో మరింత అభివృద్ది చేస్తామని వివరించారు*

Post midle

Comments are closed.