తేది :28-02-2024*
*స్థలం :అమరావతి*
*నా రైతన్నే రాష్ట్రానికి వెన్నెముక.. నా ధైర్యం రైతన్నలే.. సీఎం జగన్*
*వైఎస్సార్ రైతు భరోసా ఐదో ఏడాది మూడో విడత సాయంగా 53.58 లక్షల రైతున్నలకు రూ. 1,078 కోట్ల సాయం*
*వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ. 215 కోట్లు విడుదల*
*నేటి వరకు రైతు భరోసా కింద రైతన్నలకు రూ. 34,288 కోట్ల లబ్ధి*
*రుణమాఫీ పేరుతో రైతులకు కుచ్చుటోపీ.. రైతు భరోసా నిధుల విడదులలో సీఎం జగన్ వ్యాఖ్యలు*
దేశానికే ఆదర్శంగా అన్నదాతలను అన్నివిధాలుగా చేయి పట్టుకు నడిపిస్తూ ఎన్ని కష్టాలు ఎదురైనా చెప్పిన సమయానికి చెప్పినట్లుగా రైతన్నల సంక్షేమానికి కొండత అండనిస్తూ రైతుకు భరోసా పథకాన్ని మనందరి ప్రభుత్వంలో బాధ్యతగా అమలు చేస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వరుసగా ఐదో ఏడాది వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమం అమలులో ఈ ఏడాదికి మూడో విడతగా వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. రైతన్నలకు ఒక్కొక్కరికి ఏటా రూ. 13,500 చొప్పున వరుసగా 4 ఏళ్ళు రైతు భరోసా -పీఎం కిసాన్ సాయం అందించినట్లు పేర్కొన్నారు. ఐదో ఏడాది పథకం అమలులో భాగంగా ఇప్పటికే రెండు విడతల్లో ఒక్కో రైతుకు రూ. 11,500 ఆర్థిక సాయం అందించినట్లు వివరించారు.
ప్రస్తుతం మూడో విడదతగా రాష్ర్టంలోని 53.58 లక్షల మంది రైతన్నలు ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున 1,078.36 కోట్ల నిధులను నేరుగా రైతు ఖాతాల్లో జమచేస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార రైతు భరోసా నిధుల విడుదల సందర్భంగా తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ వర్చవల్ గా అన్ని జిల్లా కలెక్టర్ల ద్వారా రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతన్నలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కౌలు రైతులు, RoFR (అటవీ), దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతన్నలకు కూడా “వైఎస్సార్ రైతు భరోసా” కింద ఏటా రూ.13,500 ఆర్థిక సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదేనని సీఎం జగన్ పేర్కొన్నారు. నేడు అందిస్తున్న సాయంతో కలిపి ఒక్కో రైతన్నకు వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ ద్వారా మేనిఫెస్టోలో చెప్పిన రూ.50,000 కన్నా అధికంగా ఈ 57 నెలల్లో రూ. 67,500 ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. ఈ 57 నెలల్లో రైతన్నలకు వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ కింద ఇప్పటి వరకు రూ. 34,288 కోట్లు నేరుగా వారి ఖాతాల్లోనే జమచేసినట్లు పేర్కొన్నారు. ఈ 57 నెలల్లో రైతన్నల కోసం అమలు చేస్తున్న పథకాల్లో మొత్తం రూ. 1,84,567 కోట్ల సాయం మన ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లోనే జమచేసినట్లు పేర్కొన్నారు.
*వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ సున్నా వడ్డీ పంటరుణాలు*
రబీ 2021-22, ఖరీఫ్ 2022 లో రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 10,78,615 మంది రైతన్నలకు రూ. 215.98 కోట్ల వడ్డీ రాయితీ సొమ్మును సీఎం జగన్ విడుదల చేశారు. 2014-15 నుండి 2018-19 వరకు టీడీపీ ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బకాయిలతో సహా నేడు అందిస్తున్న రూ.215.98 కోట్లతో కలిపి ఈ 57 నెలల్లో “వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు” క్రింద 84.66 లక్షల మంది రైతన్నలకు అందించిన వడ్డీ రాయితీ రూ.2,050.53 కోట్లు అందించినట్లు తెలిపారు. ఈ-క్రాప్ డేటా ఆధారంగా లక్ష రూపాయల లోపు పంట రుణాలు తీసుకొని ఏడాది లోపు సమయానికి తిరిగి చెల్లించిన రైతన్నలకు వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం క్రింద పూర్తి వడ్డీ రాయితీని మన ప్రభుత్వం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్, వైఎస్సార్ సున్నావడ్డీ పంట రుణాల పథకాల క్రింద రాష్ట్రంలోని రైతన్నలకు నేడు రూ. 1,294.34 ఆర్థిక సాయం అందినట్లు సీఎం జగన్ తెలిపారు.
*గ్రామాల్లోనే రైతులకు వ్యవసాయ సేవలు*
మన ప్రభుత్వం రైతులే రాష్ర్టానికి వెన్నెముకగా భావించి గ్రామస్థాయిలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ కేంద్రాల్లోని అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా రైతులకు అవసరమైన వ్యవసాయ సేవలు అందిస్తూనే ఇ-క్రాప్ పక్కా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విత్తనుంచి పంట అమ్మకం వరకూ కూడా రైతులను చేయిపట్టుకుని నడిపిస్తున్నట్లు వివరించారు. కేవలం మన ప్రభుత్వంలో మాత్రమే ఇలా జరిగిందన్న విషయం ప్రతి ఒక్క రైతు గుర్తుచేసుకోవాలని సూచించారు. దీంతో పాటు ఆక్వా రైతులకు రూ. 1.5కే కరెంటు ఇస్తూ ఆదుకున్నట్లు పేర్కొన్నారు. పాల సేకరణలో కూడా రైతులకు తోడుగా నిలిచి రూ.10-20 ల వరకూ రైతులకు అధిక ధరలు వచ్చేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. పాలసేకరణ రైతులకు ఈ ఐదేళ్ల కాలంలోనే ధరలు పెరిగాయని సహకార రంగంలో దేశంలోనే అతిపెద్ద సంస్థ అయిన అమూల్‌ను తీసుకు వచ్చి ఈ రంగంలో పోటీని పెంచడంతో రైతులకు మేలు జరిగిందని సీఎం జగన్ పేర్కొన్నారు. 100 సంవత్సరాల క్రితం భూ సర్వే తర్వాత రెవెన్యూ రికార్డులు అప్‌డేట్ కాకపోవడం, సబ్ డివిజన్లు జరక్కపోవడం గుర్తించిన మన ప్రభుత్వం భూ వివాదాలకు చెక్‌పడుతూ సమగ్ర సర్వేచేపట్టినట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. రికార్డులను అప్‌డేట్ చేస్తూ రిజిస్ట్రేషన్ సేవలను గ్రామస్థాయిలో తీసుకు వచ్చినట్లు వివరించారు. 34.77 లక్షల ఎకరాలపై పూర్తి హక్కులను పేద రైతులకు కల్పించామన్నారు.
*రుణ మాఫీ పేరుతో రైతులకు చంద్రబాబు కుచ్చుటోపీ*
2014 ఎన్నికల సమయంలో రైతుల ఓట్ల కోసం చంద్రబాబు రుణమాఫీ పేరుతో రైతులకు కుచ్చు టోపీ పెట్టారని, రైతాంగాన్ని దారుణంగా మోసం చేశారని సీఎం జగన్ విమర్శించారు. రూ. 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణాలు మాఫీచేస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కొంచమైనా మేలు చేశారా అని ప్రశ్నించారు. బ్యాంకుల్లో బంగారం రావాలంటే బాబే ముఖ్యమంత్రి కావాలన్న అడ్డగోలు ప్రచారాన్ని నమ్మి అప్పట్లో రైతులు ఆయనకు అధికారం ఇస్తే దారుణంగా మోసం చేశారన్నారు. బేషరుతుగా రుణాలు మాఫీచేస్తానని చెప్పి చివరకు రుణమాఫీ పత్రాలు ఇచ్చి మోసం చేశారన్నారు. చివరకు సున్నా వడ్డీ పథకాన్ని కూడా ఎగరగొట్టారన్నారు. చంద్రబాబు చెప్పిన హామీలు కూడా చివరకు మన ప్రభుత్వమే చెల్లించిందన్నారు. బాబు హయాంలో రైతన్నలు కట్టిన వడ్డీలు, చక్రవడ్డీలే ఏడాదికి దాదాపు రూ.5-6 వేల కోట్లు ఉంటాయన్నారు. అంత దారుణంగా చంద్రబాబు గతంలో మోసం చేస్తే మనం ఈ ఐదేళ్లలో వైయస్సార్ రైతు భరోసా కింద రూ.34వేల కోట్లు ఇచ్చామని, ధాన్యం కొనుగోలు కోసం రూ.65వేల కోట్లు ఖర్చు చేశామని, ఇది కాక రూ.1.2 లక్షల కోట్లు రైతున్నలకు వివిధ పథకాలు ద్వారా అందించినట్లు తెలిపారు. గతానికి, ఈ ఐదేళ్లలో మన ప్రభుత్వానికి తేడాను గమనించాలని ఈ సందర్భంగా సీఎం జగన్ రైతులకు సూచించారు.
Comments are closed.