The South9
The news is by your side.
after image

హనుమాన్”కి విజువల్ ఎఫెక్ట్స్ అద్దడం నా పూర్వజన్మ సుకృతం.

హనుమాన్”కి విజువల్ ఎఫెక్ట్స్

అద్దడం నా పూర్వజన్మ సుకృతం!!

 

రాజమౌళి సరసన సగర్వంగా 

నిలిచే ప్రతిభాశాలి ప్రశాంత్ వర్మ

Post Inner vinod found

“గ్రాఫిక్స్ మాంత్రికుడు” ఉదయ్ కృష్ణ

విజువల్ ఎఫెక్ట్స్ రంగంతో రెండున్నర దశాబ్దాల సుదీర్ఘ అనుబంధం కలిగి… ఈ క్రాఫ్ట్ లో “గ్రాఫిక్స్ మాంత్రికుడు”గా మన్ననలందుకునే ఉదయ్ కృష్ణ… అసాధారణ విజయం సాధిస్తున్న “హనుమాన్” చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడుగా పనిచేసే అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని పేర్కొంటూ ఎంతో భావోద్వేగానికి లోనవుతున్నారు. భారత చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే “హనుమాన్” చిత్రానికి పని చేసే అవకాశం ఇచ్చిన ప్రశాంత్ వర్మకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెబుతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా వినియోగించుకోవడంలో విజనరీగా పేరొందిన దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సరసన సగర్వంగా నిలిచేంత దార్శనికత ప్రశాంత్ వర్మలోనూ పుష్కలంగా ఉందంటూ “హనుమాన్” రూపకర్తపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు విజువల్ ఎఫెక్ట్స్ ఎక్స్పర్ట్ ఉదయ్ కృష్ణ!!

 

తేజా సజ్జా టైటిల్ పాత్రలో ప్రైమ్ షో ఎంటర్త్సైన్మెంట్ పతాకంపై ప్రవాస భారతీయ ప్రముఖుడు కె.నిరంజన్ రెడ్డి నిర్మించిన “హనుమాన్” జనవరి 12న విడుదలై విజయ దుందుభి మ్రోగిస్తోంది. టీజర్ విజువల్స్ మైండ్ బ్లోయింగ్ అనిపించడతో “హనుమాన్” చిత్రంపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ప్రశాంత్ వర్మ స్వయంగా సమకూర్చిన కథ – కథనాలకు ఉదయ్ కృష్ణ సారధ్యంలో అద్దిన గ్రాఫిక్స్ జత కలవడంతో “హనుమాన్” చిత్రం అత్యద్భుతంగా రూపొందింది. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఇప్పటికే విడుదల చేయగా… మరాఠీ, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ లాంగ్వేజిస్ లోనూ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్రఖని, గెటప్ శ్రీను ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం “విజువల్ ఫీస్ట్”గా నీరాజనాలు అందుకుంటోంది!!

Post midle

రెండేళ్లుగా తన జీవితంలో అంతర్భాగంగా మారిపోయిన “హనుమాన్” సాధిస్తున్న సంచలన విజయం… ఈ చిత్రం కోసం తాను పడిన కష్టమంతా మరిచిపోయేలా చేస్తోందని ఉదయ్ అంటున్నారు. ప్రతికూలతలు, పరిమిత వనరుల నడుమ ప్రతిభను చాటడంలో పేరెన్నికగన్న ఉదయ్ ప్రస్తుతం “బీస్ట్ బెల్స్” పేరుతో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన విజువల్ ఎఫెక్ట్స్ సంస్థను హైద్రాబాద్ లోనే నెలకొలిపే సన్నాహాల్లో తలమునకలై ఉన్నారు. పతాక సన్నివేశాల్లో భూమ్యాకాశాలకు విస్తరించే హనుమాన్ కు జీవం పోయడం ఈ చిత్రం కోసం తాను ఫేస్ చేసిన అతి పెద్ద ఛాలెంజస్ లో ముఖ్యమైనదని చెబుతున్న ఉదయ్… మన తెలుగు దర్శకులు కలలు గనే ఎంత గొప్ప విజువల్ అయినా… సునాయాసంగా సాకారం చేసే సామర్ధ్యం తనుకుందని సవినయంగా చెబుతున్నారు!!!

Post midle

Comments are closed.