ఢిల్లీ: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నరసాపురం ఎంపీ కె.రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు పిటీషన్ ఇచ్చినట్లు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి తెలిపారు.
స్పీకర్ ను కలిసిన తరువాత ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. యాంటీ డిఫెక్షన్ లా ప్రోవిజన్స్ ప్రకారం చర్య తీసుకోవాలి అని కోరామన్నారు. వాలంటరీ గివింగ్ అప్ ఆఫ్ మెంబర్‌షిప్‌ను వర్తింప చేయాలని విజ్ఞప్తి చేశాం. ఆయన స్వపక్షంలో విపక్షంగా వ్యవహరిస్తున్నారని అన్నారు
ఇతర పార్టీలతో కుమ్మకై సొంతపార్టీని ఇబ్బంది పెట్టాలని యత్నిస్తున్నాడన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీస్ పై మాత్రమే ఆయన హైకోర్టుకు వెళ్ళారు. రఘురామ కృష్ణంరాజుపై చర్యలు తీసుకుంటానని స్పీకర్ హామీ ఇచ్చారని విజయసాయిరెడ్డి తెలిపారు.
టీడీపీ నుంచి బీజేపీకి వెళ్ళిన వారి ప్రోద్భలంతోనే రఘురామకృష్ణంరాజు ఇలా మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. పార్టీ పేరునే న్యాయపరమైన వివాదంలోకి లాగాలని ప్రయత్నిస్తున్నారన్నారు. రఘురామ కృష్ణంరాజుకు సీఎం వైఎస్.జగన్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని, సీనియర్లను కాదని ఆయనకు పార్లమెంట్ లో పదవులు ఇచ్చారని విజయసాయి రెడ్డి వివరించారు.
వెంకన్నపై భక్తి ఉంటే తిరుమల భూములపై టీటీడీ చైర్మన్, అధికారులతో ఎందుకు చర్చించలేదు? అని అడిగారు. కేవలం పార్టీని ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతోనే ఆయన వ్యవహరిస్తున్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు.
Prev Post
Comments are closed.