అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితో మరికాసేపట్లో సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. హీరోలు చిరంజీవి, ప్రభాస్, ఎన్టీఆర్ , మహేష్, తో పాటు దర్శకుడు రాజమౌళి, కొరటాల శివ, నిర్మాతలు నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లారు. ఈ పర్యటన నిమిత్తం వచ్చిన మెగాస్టార్ చిరంజీవి విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన మాటలు ఆసక్తికరంగా మారాయి. తనకు ఆహ్వానం అందిందని మిగతా వారు ఎవరెవరు వస్తున్నారో తనకు తెలియదని అన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ సమావేశానికి సినీ ప్రముఖుల తరఫున చిరంజీవి నేతృత్వం వహించడం అనే వార్తలు ఊహ జనితం అనిపించాయి . ఈ వ్యవహారం మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దల వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రితో భేటీ అయిన తర్వాత సినిమా టికెట్ల రేట్ల విషయంతోపాటు మిగతా అంశాలు కి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది
Comments are closed.