న్యూఢిల్లీ: భారత-చైనా సరిహద్దులో గత కొన్ని రోజులుగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ భారత్-చైనా సరిహద్దు ప్రాంతమైన లడఖ్‌లోని లేహ్‌లో అడుగుపెట్టారు.
ప్రధాని మోదీ, సీడీఎస్(చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆఫ్ ఇండియా) జనరల్ బిపిన్ రావత్ లు లేహ్ కు చేరుకున్నారు. చైనాతో గాల్వన్ లోయలో 18 రోజుల ఘర్షణ తరువాత అక్కడి పరిస్థితిని సమీక్షించడానికి వెళ్లారు. ప్రస్తుతం లడఖ్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ.. అక్కడి పరిస్థితిని స్వయంగా సమీక్షించేందుకు వెళ్లారు. సరిహద్దులో మోదీ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Comments are closed.