ఇదేం పోలిక అనుకునేరు. ఇప్పుడు ఇలాగే చైనీయులను పోల్చాలి. మొన్నీ మధ్య ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఓ రిటైర్డ్ ఆర్మీ అధికారి ఓ విషయం పంచుకున్నారు. 1962లో చైనా సరిహద్దులో ఉండే భారత సైనికులను దాదాపు 20 మందిని చంపేసింది. వెంటనే మనోళ్లు చైనీయులపై దాడిచేసి 80 మందిని ఖతం చేశారు. 2020 లద్దాఖ్‌లో కూడా కర్నల్ సంతోష్‌బాబుపై దాడి తరువాత చెలరేగిన సైనికులు.. అభిమన్యులుగా చెలరేగారు. ఒక్కోకరు కనీసం నలుగురైదుగురిని ముట్టుబెట్టారు. ఈ లెక్కన.. 100 మంది వరకూ చైనా లిబరేషన్ ఆర్మీ సైనికులను కోల్పోయి ఉంటుందంటూ లెక్కలు గట్టారు. నిజానికీ చైనా సాంకేతికంగా.. మార్షల్ ఆర్ట్స్‌లోనూ మాంచి ఖతర్నాకే. కానీ.. దేశభక్తి నరనరాల్లో జీర్ణించుకుపోయిన భారతీయుల బావోద్వేగం ముందు ఎటువంటి యుద్దకళలూ పనిచేయవు. నాటి శివాజీ నుంచి ఇప్పటి సంతోష్‌బాబు వరకూ వీరులుగా మారటానికి కేవలం భరతమాత.
దేశభక్తి. ఉగ్గుపాలతో రంగరించిన ఈ పదం… అణుబాంబును ఎదుర్కోనే శక్తినిస్తుందనటంలో అతిశయోక్తి కాదు. నరేంద్రమోదీ.. చైనా బోర్డర్ పర్యటన నిజంగానే షాక్. అటు పాక్, ఇటు చైనా రెండు దేశాలు కూడా నరేంద్రుడి పర్యటన వెనుక ఆంతర్యాన్ని లెక్కగట్టే పనిలో పడి ఉంటాయి. యుద్ధవాతావరణం.. రెండువైపులా వేలకొద్దీ సైనికులు.. వైమానిక దళాలు.. ఇలా.. రెప్పపాటులో బాంబులతో దద్దరిల్లే అవకాశం ఉన్న చోటికి.. ఒక దేశాధినేత వెళ్లటం.. నిజంగానే ఊహించని సంఘటన. ఇది నైతికంగా భారత్ సాధించిన విజయం. 130 కోట్ల మంది ఎంత ధైర్యంగా ఉన్నారనే విషయాన్ని బోర్డర్ వరకూ వెళ్లి నాయకుడుగా సత్తాచాటారు మోదీ. ఇది సహజంగానే ఇండియన్ ఆర్మీను మరింతగా ఉత్సాహపరుస్తుంది. వాస్తవానికి ఈ పర్యటనలో పాల్గొనాల్సింది రాజ్‌నాథ్‌సింగ్. కానీ రాత్రికి రాత్రే వాయిదా వేశారు. మోదీ తెరమీదకు వచ్చి యుద్ధోన్మాధులకు.. సవాల్ విసిరాడు. భారత్‌తో సమరానికి ఉవ్విళ్లూరే ఎవరైనా ఒక్క అడుగు వేస్తే.. మేం పది అడుగులు వేసేందుకు సన్నద్ధంగా ఉన్నామంటూ తేల్చిచెప్పాడు. అదే సమయంలో సైనికులకు మీ వెంట మేమున్నామనే భరోసాన్నిచ్చారు. సింహం ముందు చైనీయుల చీమకళ్లు ఎంత అనేది చెప్పకనే చెప్పారు. రాజనీతితోపాటు.. రణనీతి కూడా మాకు తెలుసంటూ ప్రత్యర్థుల గుండెల్లోశతఘ్నులు పేల్చారు.
Comments are closed.