*తేది: 30-06-2023*
: తాడేపల్లి*
జగనన్న సురక్ష క్యాంపుల్లో ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు క్రియాశీలకంగా పాల్గొనాలి*
*జగనన్న సురక్ష కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించాలి*
*పార్టీ నేతలకు వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి సూచన*
ప్రభుత్వ పథకాలకు, సేవలకు అర్హత ఉండి ఏదైనా చిన్న చిన్న కారణాల చేత అందకుండా మిగిలిపోయిన వారికి లబ్ధి చేకూర్చాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. తాడేపల్లి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు, నియోజకవర్గ పరిశీలకులతో ఎంపీ విజయసాయిరెడ్డి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో పార్టీ క్షేత్రస్థాయి కమిటీల నిర్మాణం, జగనన్న సురక్ష కార్యక్రమాలపై వారికి దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు, సేవలు అర్హులందరికీ అందించాలన్న లక్ష్యంతో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారని చెప్పారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా జూలై 1 నుంచి మండల స్థాయి అధికారులు ఏర్పాటు చేయనున్న శిబిరాల్లో పార్టీ నాయకులు క్రియాశీలకంగా పాల్గొనాలని చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రతి క్యాంపులో పార్టీ కీలక నేతలు క్రియాశీలకంగా పాల్గొనేలా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు చూడాలని సూచించారు. ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గ పరిధిలోని సచివాలయాల్లో నిర్వహించే శిబిరాల్లో పాల్గొనాలని ఆదేశించారు.
ప్రజలందరినీ ఈ శిబిరాలకు ఆహ్వానించి జగనన్న సురక్ష కార్యక్రమం గురించి అవగాహన కల్పించాలన్నారు. ప్రధానంగా అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ కార్యక్రమంపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జగనన్న సురక్ష క్యాంపు ప్రారంభానికి ముందు అసెంబ్లీ నియోజకవర్గం స్థాయిలో మీడియా సమావేశాలు ఏర్పాటు చేయాలని, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా విలేఖరుల సమావేశం నిర్వహించాలని ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు, నియోజకవర్గ పరిశీలకులకు సూచించారు. ధ్రువీకరించబడిన మూడో జాబితా గృహ సారథులందరూ జగనన్న సురక్ష ప్రచారంలో చురుగ్గా పాల్గొనేలా ఎమ్మెల్యేలు కోఆర్డినేటర్లు చూడాలన్నారు. సురక్ష క్యాంపెయినింగ్ సమయంలో పథకాలు లేదా పత్రాలకు సంబంధించి తమకు ఎలాంటి సమస్యలు లేవని పౌరులు పేర్కొంటే సీఎంతో వారు ప్రశంసలు పంచుకోవడానికి “థాంక్యూ జగనన్న” అని టైప్ చేసి 90526 90526 నంబర్‌కు ఎస్ఎంఎస్ పంపించేలా చూడాలన్నారు.
*కమిటీల ప్రతిపాదనలను జూలై -3 లోగా పంపించండి*
అనుబంధ విభాగాల పటిష్టతతోనే పార్టీ బలోపేతం చేసుకోగలమని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగ కమిటీల ప్రతిపాదనలలను జూలై 3వ తేదీ లోగా తప్పనిసరిగా పార్టీ కేంద్ర కార్యాలయానికి సమర్పించాలని ఆయన ఈ టెలికాన్ఫరెన్స్ లో విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే 18 జిల్లాల నుంచి కమిటీల జాబితాలను కేంద్ర కార్యాలయానికి సమర్పించారని, మిగిలిన 8 జిల్లాల కమిటీల జాబితాలను అందజేయాలని కోరారు. అలాగే పార్టీ నగర కార్పొరేషన్ కమిటీలకు సంబంధించిన ప్రతిపాదలను కూడా త్వరగా పంపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Comments are closed.