*ఆత్మకూరు అభివృద్దిలో అందరి భాగస్వామ్యం : ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*
*: ఆత్మకూరు డెవలప్ మెంట్ ఫోరంకు అంకురార్పణ*
*: ఉన్నతస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో రౌంట్ టేబుల్ సమావేశం*
*: ఏడీఎఫ్ కు మేకపాటి ఫౌండేషన్ ద్వారా రూ.10 కోట్లు ప్రకటించిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*
*ఆత్మకూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేసేందుకు అందరి భాగస్వామ్యం అవసరమని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని శ్రీధర్ గార్డెన్స్ వేదికగా ఉన్నతస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల్లో ఉన్నతస్థాయి వ్యక్తులతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.*
*ఈ సందర్భంగా రక్షణశాఖ మంత్రి సాంకేతిక సలహాదారుడు గుండ్రా సతీష్ రెడ్డి, సీడ్స్ సంస్థ వ్యవస్థాపకులు, ఎంజీఆర్ ఫౌండేషన్ సభ్యులు ఆర్ చంద్రమౌళేశ్వరరెడ్డి, నుడా వైస్ చైర్మన్ టీ బాపిరెడ్డి, ఆత్మకూరు ఆర్డీఓ ఎస్ కరుణకుమారి, ప్రజాప్రతినిధులతో కలసి జ్యోతిప్రజలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.*
*ఆత్మకూరు నియోజకవర్గం ప్రధానంగా అభివృద్ది సాధించేందుకు, భవిష్యత్తు తరాల వారి కోసం అవసరమైన మౌళిక సదుపాయల కల్పనకు, విద్యా, ఉపాధి అవకకాశాలు, సాంకేతిక నైపుణ్యం, వ్యవసాయం, పారిశ్రామికంగా ఆత్మకూరును అభివృద్ది చేసేందుకు అవసరమైన మౌళిక సదుపాయాల ఏర్పాటు కోసం ‘’ఆత్మకూరు డెవలప్ మెంట్ ఫోరం’’కు అంకుర్పారణ చేశారు. ఈ ‘’ఆత్మకూరు డెవలప్ మెంట్ ఫోరం’’కు లోగోను రక్షణశాఖ మంత్రి సాంకేతిక సలహాదారుడు డాక్టర్ గుండ్రా సతీష్ రెడ్డి ఆవిష్కరించారు.*
*వివిధ విభాగాలకు చెందిన ఉన్నతస్థాయి అధికారులు, పలు రంగాలలో ఉన్న మేధావులు, ప్రజాప్రతినిధులతో చర్చా వేదిక మీద చర్చించారు. అనంతరం రక్షణశాఖ మంత్రి సాంకేతిక సలహాదారుడు గుండ్రా సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ది కోసం ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని పేర్కొన్నారు.*
*ముఖ్యంగా నియోజకవర్గం వ్యవసాయంపై ఆధారపడి ఉన్నందున ఆ దిశగా అందరం సమిష్టిగా కృషి చేయాలని, దానికి అందరి సహకారం ఉంటుందని, ప్రస్తుతం ప్రజలకు అవసరమైన మౌళిక వసతుల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించాలని పేర్కొన్నారు. అంతేకాక వ్యవసాయాన్నే జీవనాధారం చేసుకునే రైతులకు అవసరమైన అభివృద్ది పనులతో పాటు విద్య, ఉపాధి రంగాలపై దృష్టి సారించాలని సూచించారు. పారిశ్రామికంగా ఆత్మకూరు నియోజకవర్గానికి ప్రాధాన్యత కల్పించే విధంగా చూడాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏడీఎఫ్ ను మరింత ముందుకు తీసుకెళ్లవచ్చునని సూచించారు.*
*సీడ్స్ సంస్థ వ్యవస్థాపకులు, ఎంజీఆర్ ఫౌండేషన్ సభ్యులు ఆర్ చంద్రమౌళేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ప్రపంచంలో విద్యాప్రమాణాలు రోజురోజుకు అభివృద్ది చెందుతున్న క్రమంలో మన ప్రాంత విద్యార్థులకు సైతం సాంకేతిక విద్యను అందించడం ద్వారా వారు మరింత అభివృద్దిలోకి వస్తారని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని పలు పాఠశాలల్లో డిజిటల్ క్లాసులు ఏర్పాటు చేసి విద్యార్థులకు ఉన్నతమైన విద్యనందించేందుకు కృషి చేయాలని సూచించారు. సాంకేతికంగా వారికి ఉన్నతమైన విద్యను అందిస్తే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి వారి స్వశక్తి మీద ఎదుగుతారని సూచించారు. ఆ దిశగా ఏడీఎఫ్ ద్వారా మరింత అవకాశాలు కల్పించేందుకు వీలవుతుందని అన్నారు.*
*వర్చువల్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కెవియన్ చక్రధర్ బాబు మాట్లాడుతూ జిల్లాలో మెట్ట ప్రాంతమైన ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్దికి తమ పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, దాతృత్త్వ వేత్తలు, స్థానిక ప్రజాసంఘాల నాయకులు సమిష్టి సహకారంతో వెనుకబడిన ఆత్మకూరు నియోజకవర్గాన్ని అభివృద్ది చేసేందుకు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిని ఆధ్వర్యంలో ఏడీఎఫ్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని, దాతలు, స్వచ్చంధ సంస్థలు ముందుకు వచ్చి ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్దిలో భాగస్వాములు కావాలన్నారు. విద్య, వైద్యరంగలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, వ్యవసాయ రంగానికి కూడా తమ వంతు సహకారం అందించాలని సూచించారు. అభివృద్ది పరంగా ఆత్మకూరు నియోజవర్గాన్ని ఇతర నియోజకవర్గాలకు ఆదరశంగా నిలపాలని జిల్లా కలెక్టర్ సూచించారు.*
*ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్దిలో నిలిపేందుకే వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులతో, ఉన్నతస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో ఈ ఆత్మకూరు డెవలమ్ మెంట్ ఫోరం ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. దీని ద్వారా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా విద్య, ఉపాధి అవకాశాలే కాక రైతులకు, విద్యావంతులకు అవసరమైన అన్ని మౌళిక సదుపాయాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరి సహకారం అవసరమని పేర్కొన్నారు.*
*ఆత్మకూరు నియోజకవర్గానికి జాతీయ రహదారుల అనుసంధానం ఉన్న క్రమంలో పారిశ్రామికంగా అభివృద్ది సాధించేందుకు కృషి చేస్తామని, ఇందుకోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి అభివృద్ది కోసం కోరినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గం హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు వెళ్లే జాతీయ రహదారులు ఏర్పాటు కావడం ద్వారా లాజిస్టిక్ పార్కు ఏర్పాటు చేసుకోవడమే కాక 500 కు పైగా చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు ద్వారా నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా మరింత అభివృద్ది చేసుకోవచ్చునని పేర్కొన్నారు. తన సోదరుడు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరున ఇప్పటిక నియోజకవర్గ కేంద్రంగా బస్టాండ్ నిర్మాణాన్ని ప్రారంభించామని, నియోజకవర్గంలో పలు అభివృద్ది పనుల కోసం ఏడీఎఫ్ కు తమ కుటుంబం తరపుర రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆత్మకూరు నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ది సాధించే దిశగా అందరి సమిష్టి సహకారంతో ముందుకెళ్తామని పేర్కొన్నారు.*
*ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన ఉన్నతాధికారులు మెమోంటోలు అందచేసి ధన్యవాదాలు తెలిపారు.*
Comments are closed.