(సినీ బ్యూరో) తెలుగు ఫిలిం మేకర్ లు తమ సినిమాల విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు అనుకోవాలి. కథ కోసం పాత్ర కోసం ఎంత ఖర్చు కైనా వెనకాడే పరిస్థితి లేదు. ఒక బాహుబలి కాకుండా చాలా చిత్రాలు , అంతర్జాతీయ స్థాయిలో కలెక్షన్లు రాబట్టడం తో తెలుగు సినిమా బడ్జెట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం లైగర్. పూరి నిర్మాణ సారథ్యం తో పాటు బాలీవుడ్ ప్రముఖ మేకర్ కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్న టువంటి ఈ చిత్రం ఇప్పటికే వార్తల్లో నిలిచింది. ఈ చిత్రంలో లో ప్రముఖ అంతర్జాతీయ బాక్సర్ మైక్ టైసన్ నటిస్తున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. గతంలోని మైక్ టైసన్ ని సంప్రదించండి జరిగిందని అప్పుడు చర్చల వరకే వ్యవహారం సాగిందని, తాజాగా ఈ చిత్రంలో నటించడానికి అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది ? ఇదే కనుక నిజమైతే మొత్తానికి మైక్ టైసన్ ను భారతీయ ప్రేక్షకులకు చూపించబోతున్న టువంటి క్రెడిట్ పూరి జగన్నాథ్ కి దక్కుతుంది. గతంలో దక్షిణ దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించిన’ ఐ’ చిత్రానికి హాలీవుడ్ నటుడు “ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ “నటించాలని చూసినప్పటికీ ని, అది ఎందుకో కార్యరూపం దాల్చలేదు.
Comments are closed.