The South9
The news is by your side.
after image

అందరికి ఉపయోగకరంగా ఎంజీఆర్ మున్సిపల్ బస్టాండ్ : ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి.

*అందరికి ఉపయోగకరంగా ఎంజీఆర్ మున్సిపల్ బస్టాండ్ : ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*

*: ఇంద్రా ఏసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే*

*: రాష్ట్ర మంత్రి విశ్వరూప్ కు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే మేకపాటి*

 

*ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంగా అన్ని గ్రామాల ప్రజలకు ఉపయోగపడే విధంగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరున నిర్మించిన ఎంజీఆర్ మున్సిపల్ బస్ టెర్మినల్ ప్రజలందరికి ఉపయోగపడే విధంగా అన్ని వసతులు సమకూర్చినట్లు ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు.*

 

*శుక్రవారం ఆత్మకూరులోని ఎంజీఆర్ మున్సిపల్ బస్ టెర్మినల్ నుండి హైదరాబాద్, బెంగళూరులకు నూతనంగా మంజూరు చేసిన నాలుగు ఇంద్రా ఏసీ సర్వీసులను ఆయన ఆర్టీసీ రీజనల్ మేనేజర్, ఆత్మకూరు ఆర్డీఓ, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, నాయకులతో కలసి లాంఛనంగా ప్రారంభించారు.*

 

*ఈ సందర్భంగా మున్సిపల్ బస్టాండ్ ను పరిశీలించి ఆర్టీసీ అధికారులకు పలు సూచనలు అందచేశారు. అనంతరం నూతనంగా ప్రారంభించిన బస్సు సర్వీసులను ఆయన స్వయంగా పరిశీలించి డ్రైవర్లతో మాట్లాడారు.*

 

*ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలో అందరికి ఉపయోగపడే విధంగా ఎంజీఆర్ ఫౌండేషన్ నిధులతో ఆత్మకూరు డెవలప్ మెంట్ ఫోరం ద్వారా ఈ బస్టాండ్ నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు.*

 

Post midle
Post Inner vinod found

*ఈ బస్టాండ్ కు ప్రతి రోజు 70 వరకు బస్సులు వస్తున్నాయని, 10 వేల మంది ప్రయాణీకులు బస్టాండ్ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారని తెలిపారు.*

 

*గతంలో ఆత్మకూరు పట్టణంలోనికి రాకుండా బైపాస్ రోడ్డు మీదుగా వెళ్లిపోయిన అన్ని బస్సులు ప్రస్తుతం ఆత్మకూరులోనికి వచ్చే విధంగా ఆర్టీసీ జిల్లా స్థాయి అధికారులను కోరామని, బస్సులు ఆత్మకూరుకు వచ్చి వెళ్తాయని తెలిపారు.*

 

*బస్టాండ్ ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ ను వైజాగ్, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు ఈ బస్టాండ్ నుంచి బస్సులు కేటాయించాలని కోరడం జరిగిందని అన్నారు.*

 

*ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరులకు ఏసీ బస్సులను ఏర్పాటు చేశారని, ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. రానున్న రోజుల్లో ఓల్వా బస్సులు కూడా కోరి ఉన్నట్లు తెలిపారు.*

 

*అదే విధంగా ఆత్మకూరు నియోజకవర్గంలో ఏడీఎఫ్ ద్వారా పలు మండలాల్లో బస్టాండ్ల నిర్మాణాలకు శ్రీకారం చుడుతున్నామని, సంగం, మర్రిపాడు, చేజర్ల, ఏఎస్ పేట మండలాల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.*

 

*అనంతరం ఇంద్రా ఏసీ బస్సులో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులతో కలసి పర్యటించిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధునాతన సౌకర్యాలు గల బస్సులు ఆత్మకూరుకు కేటాయించడం పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ కు ఫోన్ చేసి స్వయంగా ధన్యవాదాలు తెలిపారు.*

Post midle

Comments are closed.