The South9
The news is by your side.
after image

ముఖ్యమంత్రిని కలిసిన ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి.

*ముముఖ్యమంత్రిని కలిసిన ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డిఖ్యమంత్రిని కలిసిన ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి*

*: నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు నిధులు మంజూరుకై వినతి*

 

*ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఉదయగిరి వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డితో కలసి మర్యాదపూర్వకంగా కలిశారు.*

 

*ఈ సందర్భంగా ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలకు సంబంధించిన పలు అభివృద్ది పనులు, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం, ఇతర కార్యక్రమాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు.*

 

*ఆత్మకూరు నియోజకవర్గంలో సుమారు 80 దేవాలయాలకు సంబంధించి తిరుపతి తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్టు కింద నిధులు మంజూరు చేయించాలని ముఖ్యమంత్రికి విన్నవించారు.*

 

Post Inner vinod found

*ఆత్మకూరు నియోజకవర్గంలోని మండల కేంద్రమైన సంగంలో రూ.5 కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ ఐటీఐ కళాశాల భవనానికి గంటా రమణయ్యనాయుడు ప్రభుత్వ ఐటీఐ కళాశాలగా పేరు మార్చేందుకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు.*

 

*ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని సోమశిల జలాశయానికి ఆత్మకూరు నుండి వెళ్లే రాష్ట్ర రహదారి సుమారు 40 కిలోమీటర్లు ఉందని, రెండు జాతీయ రహదారులు ఈ రోడ్డును పలు ప్రాంతాల్లో అనుసంధానమవుతాయని, ఈ రహదారిపై అధిక టన్నేజి కలిగిన వాహన రాకపోకల కారణంగా రోడ్డు దెబ్బతింటుందని, సత్వరమే మరమ్మతులు చేయించేలా నిధులు మంజూరు చేయాలని విన్నవించారు.*

 

Post midle

*అదే విధంగా అనంతసాగరం, ఆత్మకూరు మండలాలకు సంబంధించి కొమ్మలేరు మీడియం డ్రైన్ వెడల్పు పనుల కోసం భూములు అందచేసిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని విన్నవించి ఉన్నారని, ఈ విషయమై నెల్లూరు జిల్లా కలెక్టర్ కు సీసీఎల్ఏ, రాష్ట్ర రెవెన్యూశాఖ, వాటర్ రిసోర్స్ ప్రిన్సిపల్ సెక్రటరిలకు భూసేకరణ కోసం అనుమతులు మంజూరు కొరకు లేఖ అందచేసి ఉన్నారని, ఈ పనులను త్వరగా చేపట్టే విధంగా చూడాలని కోరారు.*

 

*నెల్లూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని ఆటోమొబైల్ ల్యాబ్ పరికరాలను అక్కడి నుండి ఆత్మకూరు పాలిటెక్నిక్ కళాశాలకు బదిలీ చేయించాలని, దీని ద్వారా ఆత్మకూరు నియోజకవర్గంలోని యువతకు ఆటోమొబైల్ సెక్టార్ లో శిక్షణ అందించవచ్చునని, దీని విషయమై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.*

 

*సంగం మండలం అన్నారెడ్డిపాళెం సిద్దీపురంలో జగనన్న హౌసింగ్ కాలనీలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న బిల్లుల మంజూరుపై చర్యలు తీసుకోవాలని, అదే విధంగా ఆత్మకూరు నియోజకవర్గంలో జగనన్న కాలనీలను అభివృద్ది చేసేందుకు పెండింగ్ లో ఉన్న బిల్లులు మంజూరు చేయించాలని విన్నవించారు.*

 

*ఆత్మకూరు సమీపంలోని నారంపేట ఎంఎస్ఎంవీ పార్కులో కంపెనీలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన భూమిని మంజూరు చేసేందుకు కంపెనీలకు 50 శాతం రాయితీలో అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు.*

Post midle

Comments are closed.