*మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*
*మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ ను ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ అధికారులతో నీటి లభ్యత, నీటి విడుదల ప్రక్రియల గురించి ఆరా తీశారు.*
*ప్రస్తుతం సోమశిల జలాశయం నుంచి 85 వేల క్యూసెక్కుల నీరు విడుదలవుతున్నాయని, వచ్చిన వరదను పెన్నానదికి విడుదల చేస్తున్నట్లు బ్యారేజ్ జెఈ విజయరామిరెడ్డి ఎమ్మెల్యేకు తెలిపారు.*
*బ్యారేజ్ వద్ద తది దశలో ఉన్న వీరింగ్ కోర్టుల పనులను వేగవంతం చేయాలని సూచించారు. బ్యారేజ్ కు మొత్తం 85 వీరింగ్ కోర్టులు ఉండగా 18 వీరింగ్ కోర్టులు తుది దశలో ఉన్నాయని అన్నారు. వారం రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు.*
*గతంలో వరదల వల్ల కలిగిన సమస్యలను ఎమ్మెల్యే మేకపాటి ఆరా తీశారు. పెన్నా పరివాహక ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.*
*అవసరమైతే స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట బ్యారేజ్ ఇంజీరింగ్ అధికారులు ఉన్నారు.*
Comments are closed.