The South9
The news is by your side.
after image

హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ ఆక్సిడెంట్ పై మీడియా ఓవర్ రియాక్షన్!

  • మీడియా ఓవర్ యాక్షన్
  • సోషల్ మీడియాలో ట్రోలింగ్
  • ప్రముఖులకు సంబంధించిన వార్తల ప్రసార విషయంలో హద్దులు దాటుతున్న రని విమర్శ
  • హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ కి మీడియా ఓవర్ రియాక్షన్!

 

రాజకీయ నాయకుల గురించి, సినిమా వాళ్ల గురించి, ఏ చిన్న విషయం బయటకు వచ్చిన వాటిని మీడియా హైలెట్ చేయడం పరిపాటి. ఎందుకంటే సామాన్య జనాలకు, రాజకీయ నాయకులు సినిమా సెలబ్రిటీల విషయాలపై ఆసక్తి ఉంటుందనే భావన మీడియా సంస్థల ది. అయితే ఇది నిజమే ఎందుకంటే రాజకీయ రంగం, సినిమా అనేది వేరైనా ప్రజల ఫోకస్ డిస్కషన్ ఎక్కువగా వీరిపై ఉంటాది అనేది నిజం. ఈ నేపథ్యంలో సినీ హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ ఆక్సిడెంట్ జరిగిన తర్వాత మీడియా చేసిన హడావుడి ఎక్కువఅయిందంటే అతిశయోక్తి కాదు. కొన్ని చానల్స్ అయితే అసలు బైక్ ఎలా డిజైన్ చేసి ఉండాలో చెప్పే రేంజ్ కి వెళ్లి దానికి ఒక పెద్ద ప్రోగ్రామ్ మే డిజైన్ చేశారు. సాయి ధరమ్ తేజ అనే అతను కేవలం ఒక సినీ నటుడు, మెగా కుటుంబం నుంచి వచ్చిన హీరో . రోజులో ఎంతోమంది ఆక్సిడెంట్ గురవుతుంటారు. వారందరి గురించి గంటలు గంటలు విశ్లేషణ చేస్తారా అనే ప్రజల ప్రశ్నలకు సమాధానాలు మీడియా సంస్థల దగ్గర ఉన్నాయా , ఇలాంటి విపరీత పోకడల వల్ల

Post Inner vinod found

మీడియాపై ప్రజలకు ఏహ్య భావం కలుగుతుంది. టిఆర్పి రేటింగ్ లకు వార్తలు ఇష్టమొచ్చినట్టు ప్రసారం చేస్తున్నారని సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ లు జరుగుతున్నాయి. సినీ దర్శకుడు హరీష్ శంకర్ మీడియాపై ఘాటుగా తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు ‌. మీడియా అంటే బాధ్యత గా ప్రజల సమస్యలపై, ప్రజా సమస్యల కొరకు ,ప్రభుత్వాలపై ప్రజల గొంతుకు లుగా మారి ఉండాలి, కానీ ప్రజల చేత చెప్పించుకునే హీనస్థితికి రాకూడదు అనేది మా అభిప్రాయం. ఇప్పటికైనా ఏ వార్తలు కి ఎంత పరిధి ఇవ్వాలో తెలుసుకొని స్వీయ నియంత్రణ పాటిస్తే అందరికీ మంచిది. ……. బాలగంగాధర్ తిలక్. హైదరాబాద్

Post midle

Comments are closed.