The South9
The news is by your side.
after image

కేంద్రం తీసుకొచ్చిన బిల్లులో పలు కీలక అంశాలు సమాఖ్య స్ఫూర్తి కి విరుద్ధంగా ఉన్నాయి: మేకపాటి గౌతమ్ రెడ్డి

 

అమరావతి.

*మారిటైం స్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ లో ఇండియన్‌ పోర్ట్స్‌ బిల్లు–2020పై అభ్యంతరాలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం*

*కేంద్రం తీసుకొచ్చిన బిల్లులో పలు కీలక అంశాలు సమాఖ్య స్ఫూర్తి కి విరుద్ధంగా ఉన్నాయన్న మంత్రి మేకపాటి*

*పోర్టులపై పర్యవేక్షణ, నియంత్రణ అధికారాలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకే ఉండాలి*

*కేంద్రం చేపట్టే మంచి పనులకు, నిర్ణయాలకు అంశాల వారిగా మద్దతిస్తాం*

*నెల రోజుల్లో ఈ బిల్లును పూర్తిగా స్టడీ చేసి నివేదిక ఇస్తామని గడువు కోరాం*

Post midle

*అధ్యయనం కోసం నిపుణుల కమిటీని నియమిస్తాం*

*అవసరమైతే తీరప్రాంత రాష్ట్రాల మద్దతు తీసుకుని పోరాటం చేస్తాం*

*మారిటైమ్ బోర్డుకు దీర్ఘకాలిక నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరాం*

*రామాయపట్నం పోర్టు పనులు నవంబర్‌లో ప్రారంభిస్తాం*

*రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగితే మాత్రం మా ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించదు*

*బిల్లును ఉన్నది ఉన్నట్లు స్వాగతిస్తే ఇక రాష్ట్ర పోర్టుల అభివృద్ధి మొత్తం పూర్తిగా కేంద్రం చేతిలోకి వెళుతుంది*

*కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయ కూడా అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు*

*మారిటైం స్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ సమావేశం అనంతరం పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యాఖ్యలు*

—————–

కొన్ని మార్పులు, సవరణలకు కేంద్రం ఒప్పుకుంటేనే ఇండియన్‌ పోర్ట్స్‌ బిల్లు–2020 స్వాగతించగలం

ఇప్పటికే ఏపీ ప్రతిపాదించిన పలు సవరణలకు అంగీకరించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు

*ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ న్యాయ విభాగం ముసాయిదా బిల్లును సమీక్షిస్తోంది*

*పూర్తి స్పష్టతకు మరింత సమయం కావాలి. బిల్లులో గుర్తించిన కొన్ని కీలక విషయాలను మీ దృష్టికి తీసుకువస్తున్నాం*

Post Inner vinod found

*భారతదేశంలో మొత్తం 160 మైనర్ పోర్టులకు సంబంధించి మారిటైమ్ పోర్టు రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్ ను బిల్లు అందిస్తోంది*

13 మేజర్ పోర్టులకు రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్, 2020 ప్రకారం 13 రెగ్యులేటరీ అథారిటీలు ఉన్నాయి. ఇది మైనర్, మేజర్ పోర్టుల మధ్య వివక్ష పెంచేలా ఉంది

మేజర్ పోర్టుల మాదిరిగానే ప్రతి రాష్ట్రానికి మారిటైమ్ పోర్టు రెగ్యులేటరీ అథారిటీ అధికారాలను ఆయా రాష్ట్రాల మారిటైమ్ బోర్డులకు అప్పగించాలి

ఓడరేవు నియంత్రణ అధికారాలు కేంద్రం నియమించిన రాష్ట్ర మారిటైమ్ బోర్డులు, రాష్ట్ర ప్రభుత్వాలకే కేంద్రప్రభుత్వం ఇవ్వాలి

“రిచ్ హెరిటేజ్” పేరుతో దేశ ఖ్యాతి ఉట్టిపడేలా మ్యూజియమ్, గ్యాలరీల ఏర్పాటు ఆలోచన బాగుంది

మైనర్ పోర్టుల నియంత్రణ బాధ్యతలు కేంద్ర ప్రభుత్వం కలగజేసుకోకూడదు. అందుకు బదులు రాష్ట్ర ప్రభుత్వాలకే ఓడరేవుల నియంత్రణ అధికారమివ్వాలి.

ఏ రాష్ట్ర ఎకనమీని ముందుకు తీసుకువెళ్లాలన్నా.. ఆయా రాష్ట్రాల పరిధిలోని ఓడరేవులు పాత్ర కీలకం. ఎందుకంటే, మైనర్ పోర్టుల ఏర్పాటులో కీలకమైన మౌలిక సదుపాయాలు, భూ కేటాయింపులు అందించేంది రాష్ట్రాలు మాత్రమే. కాబట్టి, ఒకవేళ రాష్ట్ర పరిధిలోని పోర్టులను కేంద్రమే నియంత్రిస్తే ఆయా రాష్ట్రాలు ఆర్థికంగా ముందుకు నడిపించే హక్కు, అవకాశం కోల్పోతాయి.

పైన చెప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభిప్రాయాల్లో పూర్తి వాస్తవాలు ఉన్నప్పటికీ , వాటాదారుల (స్టేక్ హోల్డర్లు) అభిప్రాయం పరిగణలోకి తీసుకోకుండా ముందుకు వెళ్లకూడదని సూచించిన పరిశ్రమల శాఖ మంత్రి

ఇప్పటికే నిర్మాణంలో ఉన్న పోర్టులు, ఏర్పాటైన మారిటైమ్ బోర్డు రాష్ట్రాలకు మినహాయింపుని కోరిన మంత్రి మేకపాటి

‘సాగరమాల’ సహా ఎన్ హెచ్ ఏ, ఎమ్ఓఆర్ టీ హెచ్ పథకాల కింద ఏపీలో రహదారులను నిర్మించేందుకు కేంద్రం అందిస్తోన్న సహాయ సహకారాలకు ధన్యవాదాలు

గంగవరం, క్రిష్ణపట్నం, కాకినాడలోని గేట్ వే పోర్టులలో రహదారుల విస్తరణ, అనుసంధానం, పూర్తికి తోడ్పడాలని కోరిన మంత్రి మేకపాటి

ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మొత్తం 32 ప్రాజెక్టులు సహా మరి కొన్ని కీలక ప్రాజెక్టులు డీపీఆర్, ప్రణాళిక దశలో ఉన్న తరుణంలో త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నాం.

గత ఢిల్లీ పర్యటనలో రాష్ట్ర కీలక ప్రాజెక్టులపై వినతిపత్రం అందించామని కేంద్ర నౌకాయాన మంత్రి మన్ సుఖ్ మాండవీయకి గుర్తు చేసిన మంత్రి మేకపాటి

పోర్టులు, ప్రాజెక్టుల అభివృద్ధికి సంబంధించి “ప్రత్యేక నిధి”ని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరిన పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఆత్మనిర్భర్ భారత్ దిశగా అడుగులు వేయడంలో ముందుంది

భారత ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించగల ఛాంపియన్ రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి

విమానాశ్రయాలు,ఓడరేవులతో పాటు అనేక వనరులు కలిగిన రాష్ట్రం, అందువల్ల ఏపీకి ఎగుమతులను ప్రోత్సహించే భారీ సామర్థ్యం ఉంది.

మారిటైం స్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ వర్చువల్ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ వాణిని వినిపించిన పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

18వ ఎంఎస్‌డీసీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తరపున మంత్రి మేకపాటితో పాటు పాల్గొన్న పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, మారిటైమ్ బోర్డు సీఈవో కె.మురళీధరన్, పరిశ్రమల శాఖ సలహాదారు లంకా శ్రీధర్

ఆంధ్రప్రదేశ్ సహా కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక ,గోవా, ఒరిస్సా , గుజరాత్, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి వర్చువల్ గా హాజరైన సంబంధిత శాఖల మంత్రులు, ప్రభుత్వ ప్రతినిధులు

——————

Post midle

Comments are closed.