న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా కేంద్రంతో దిక్కార ధోరణితో ఉన్నా ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ పై పలు కేసులు నమోదయ్యాయి. జమ్మూ కాశ్మీర్, లడక్, లను వేరే దేశాల గా చూపిస్తూ తమ వెబ్సైట్లో తప్పుడు మ్యాప్ లను క్రియేట్ చేసినందుకు గాను ట్విట్టర్ పై ఉత్తర ప్రదేశ్, యూపీ పోలీసులు కేసులు నమోదు చేశారు. అలాగే ఆ సంస్థ ప్లాట్ ఫామ్ పై చిన్నపిల్లల నీలిచిత్రాలను యాక్సిస్ ఇస్తున్నందుకు ఢిల్లీ పోలీసులు సైతం మరొక కేసును నమోదు చేశారు. గతంలో ముస్లిం వ్యక్తి చేత జై శ్రీరామ్ అనే నినాదం చేసిన వీడియోను పబ్లిష్ చేసినందుకుగాను ట్విట్టర్ ఇండియా ఎండి మనీష్ మహేశ్వరి పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరలా చిన్నపిల్లల నీలిచిత్రాల వ్యవహారం లో బజరంగ్దళ్ కార్యకర్తలు ఫిర్యాదు మేరకు ఇండియా ఎండి మనీష్ మహేశ్వరి తో పాటు న్యూస్ పార్ట్నర్ షిప్స్ హెడ్ అమృత త్రిపాటి పై యూపీ లో కేసు నమోదు చేశారు. కేంద్రం కొత్త ఐటీ నిబంధనలు తీసుకు వచ్చినప్పుడు నుంచి కేంద్ర వైఖరికి భిన్నంగా వ్యవహరిస్తున్న ట్విట్టర్ ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉంది. ఇలా ఈ మధ్య కాలంలో ట్విట్టర్ పై కేసులు నమోదవడం ఇది రెండవ సారి. ఈ వ్యవహారంలో ట్విట్టర్ వైఖరిపై నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
Comments are closed.