*ఉత్తరప్రదేశ్ లో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీ…*
దేశవ్యాప్తంగా అంతా ఆసక్తిగా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల గురించి ఎదురుచూస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ గా ఉత్తర్ ప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్ ఎన్నికలను భావిస్తున్నారు.
ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విజయం దిశగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా అన్ని పార్టీల చూపు ఉత్తర్ ప్రదేశ్ పై ఉన్న నేపథ్యంలో అక్కడ బీజేపీ తాగా మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది.
మొత్తం యూపీలో 403 స్థానాలు ఉంటే 202 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ గా ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ నుంచి మొదలుకొని… ఈవీఎంల లెక్కింపులో కూడా బీజేపీ ఆధిక్యంలో కనిపిస్తోంది. గోరఖ్ పూర్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న యోగీ ఆధిత్య నాథ్ 6000 పైగా ఓట్ల ఆధిక్యంలో కనిపిస్తున్నారు. బీజేీపీకి పోటీగా ఉన్న ఎస్పీ కేవలం 106 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు కనీస ప్రభావం కూడా చూపడం లేదు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రచారం చేసిన కాంగ్రెస్ తీవ్రంగా చతికిలపడింది.
Comments are closed.