The South9
The news is by your side.
after image

అందరం సమిష్టిగా పనిచేసి అభివృద్ది చేసుకుందాం : ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి

*అందరం సమిష్టిగా పనిచేసి అభివృద్ది చేసుకుందాం : ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*

*: గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా అభివృద్ది పనులు*

*: సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు*

*: గడప గడపకు మన ప్రభుత్వం ముగింపు సభ*

*ఆత్మకూరు నియోజకవర్గాన్ని అభివృద్ది చేసుకునేందుకు అందరం సమిష్టిగా పనిచేసి అభివృద్ది చేసుకుందామని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇక నుంచి మనమంతా పనిచేద్దామని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు.*

 

*శనివారం ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అన్ని సచివాలయాల్లో పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు డిప్యూటి మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్, నియోజకవర్గ పరిశీలకులు సింగసాని గురుమోహన్ లతో కలసి ముగింపు సభను ఏర్పాటు చేశారు.*

 

*ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా సుమారు 10 వేల గృహాల్లోని ప్రజలను స్వయంగా కలసి వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందచేసిన సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను వివరించడంతో పాటు సమస్యలను తెలుసుకోవడం జరిగిందని అన్నారు.

 

Post midle

*23 వార్డుల పరిధిలో కౌన్సిలర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ తన వెంట నడిచి ప్రతి ఇంట్లో సమస్యలను తెలుసుకునేందుకు, వాటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకునే వీలు కలిగిందని వివరించారు.*

 

*ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో ప్రభుత్వం అందచేస్తున్న సంక్షేమ పథకాలు, సమస్యల పరిష్కారం కోసం తీసుకుంటున్న చర్యలను ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి వివరించారు.*

 

*ఆత్మకూరు మున్సిపాలిటిలో జనాభా 31,652 మంది ఉన్నారని, ఇంకా ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో లే అవుట్ల నిర్మాణాల శరవేగంగా జరుగుతున్నాయని, ఇందుకోసం భవిష్యత్తును ముందే ఆలోచించి అనుమతులు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దీని ద్వారా మున్సిపల్ పరిధి పెరిగినా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని, కొన్ని నగరాలను ఉదాహరణగా తీసుకుంటే జనాభా ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలిసే ఇలా ఆలోచన చేయడం జరిగిందని అన్నారు.*

Post Inner vinod found

*ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందచేస్తున్న సంక్షేమ పథకాలు 15,331 మంది లబ్దిదారులకు అందాయని అన్నారు. సంక్షేమ పథకాల రూపంలో రూ.61.78 కోట్లు ప్రజలకు నేరుగా వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందని వివరించారు. అభివృద్ది పనుల కింద మరో రూ.19.90 కోట్లు నిధులు ఇప్పటి వరకు ఖర్చు చేయడం జరిగిందని వివరించారు. మున్సిపల్ అభివృద్దికి అవసరమైన మరో రూ.12 కోట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఉన్నామని త్వరలోనే మంజూరు చేస్తారని అన్నారు.*

 

*గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా మున్సిపల్ పరిధిలోని 23 వార్డుల పరిధిలో ప్రజలు 2036 వినతి పత్రాలను అందచేయడం జరిగిందని, వీటిలో ఇప్పటికే 575 సమస్యలను పరిష్కరించడం జరిగిందని అన్నారు. 344 వినతులు అర్హత లేని కారణంగా తిరస్కరించడం జరిగిందని, మిగిలిన వాటిని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించనున్నట్లు తెలిపారు.*

 

*మున్సిపల్ పరిధిలో రేషన్ కార్డుల కోసం 145 మంది దరఖాస్తు చేసుకుంటే 68 మందికి ఇప్పటికే మంజూరు చేయడం జరిగిందని, 65 మంది అర్హత లేని వారు దరఖాస్తు చేసుకున్నారని, 12 మందికి ఇంకా మంజూరు కావాల్సి ఉందని వివరించారు. ఇలా తెలిపిన ప్రతి సమస్యను నమోదు చేయడం జరిగిందని అన్నారు.*

 

*గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా మున్సిపల్ పరిధిలో రూ.1.60 కోట్లు మంజూరు కాగా వాటిలో ఇప్పటికే సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, విద్యుత్ స్థంభాలు, కల్వర్టుల నిర్మాణాలకు రూ.94.05 లక్షల పనులు పూర్తయ్యాయని, మిగిలిన రూ.65.95 లక్షల పనులు జరుగుతున్నాయని వివరించారు. గృహ నిర్మాణాలకు సంబంధించి 1536 మందికి మంజూరు చేసి ఉన్నారని, వివిధ దశల్లో నిర్మాణాలు సాగుతున్నాయని వివరించారు.*

 

*గృహ నిర్మాణాలకు సంబంధించి ఎమ్మెల్యే కార్యాలయంలోనే సమస్యలను పరిష్కరించేందుకు, అర్జీలు స్వీకరించేందుకు ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించనున్నట్లు, దీని ద్వారా గృహ నిర్మాణాలకు సంబంధించిన సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని, గృహ నిర్మాణాలు కూడా వేగవంతమవుతాయని వివరించారు.*

 

*ప్రతి సచివాలయం పరిధిలో ముగ్గురు వాలంటీర్లను త్వరలోనే నియమించి వార్డు పరిధిలో ఇంకా అవసరమైన అభివృద్ది, సంక్షేమ పథకాల గురించి, ప్రజల సమస్యలపై తెలుసుకోవడం జరుగుతుందని, ఈ వ్యవస్థలన్ని సరిగా పనిచేసేలే వార్డుకు ఓ అబ్జర్వర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.*

 

*ఆత్మకూరు డెవలప్ మెంట్ ఫోరం ద్వారా నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులు చేస్తున్నట్లు వివరించారు. మున్సిపల్ పరిధిలో డిజిటల్ క్లాస్ రూం ఏర్పాటు కోసం రూ.40 లక్షలు, ఇతర అభివృద్ది పనుల కోసం రూ.60 లక్షలను శింగనమల నియోజకవర్గ శాసనసభ్యులు జొన్నలగడ్డ పద్మావతి అందచేశారని, తాను పుట్టిన ఆత్మకూరు నియోజకవర్గం కోసం ఈ విధంగా ఏడీఎఫ్ ద్వారా నిధులు అందచేసిన ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు.*

 

*ఆత్మకూరు డెవలప్ మెంట్ ఫోరం ద్వారా మూడు కమ్యూనిటి హాళ్లు, పార్కు, ఆత్మకూరు చెరువు అభివృద్ది, ఆర్ఓ వాటర్ ప్లాంట్లు, శ్మశానవాటికల అభివృద్ది తదితర కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వివరించారు.

*ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలో ఆత్మకూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తానని, రానున్న 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలిచే తొలి పది స్థానాల్లో ఆత్మకూరు తప్పక ఉంటుందని , అందరి సహకారంతో పాటు బాధ్యతను తీసుకోవాలని కోరారు.*

Post midle

Comments are closed.