కడపజిల్లా.
పులివెందులలో స్కిల్ ట్రైనింగ్ అకాడమీకి అట్టహాసంగా శంకుస్థాపన
రూ.30 కోట్లతో ముఖ్యమంత్రి చేతులమీదుగా లాంఛనంగా ప్రారంభమైన స్కిల్ ట్రైనింగ్ అకాడమీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్ఎస్ డిసి) ఆధ్వర్యంలో త్వరలో పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 25 స్కిల్ కాలేజీలు
ట్రిపుల్ ఐటీలలో మరో 5 స్కిల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకువస్తాం
యువతకు మెరుగైన నైపుణ్యాలను అందించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ ఎకోసిస్టమ్ ఏర్పాటు దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు
ఉపాధి అవకాశాలను పెంచడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ముందుడుగు
పులివెందులలో కూడా ఒక్కో స్కిల్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయం
ఈ స్కిల్ కాలేజీల్లో హైఎండ్ స్కిల్స్ పై శిక్షణ ఇవ్వడం ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు
పరిశ్రమలలో స్థానికులకే 75 శాతం ఉద్యోగాల చట్టం ప్రకారం యువతీయువకులకు అపార అవకాశాలు
ప్రముఖ పరిశ్రమలు, సంస్థలుతో భాగస్వామ్యంతో ఐటిఐ, డిప్లొమా, ఇంజనీరింగ్, పోస్టు గ్రాడ్యుయేషన్ చదువుతున్న విద్యార్థులకు వివిధ రంగాల్లలో నైపుణ్య శిక్షణ, రీస్కిల్లింగ్, అదనపు నైపుణ్య శిక్షణ
తద్వారా పరిశ్రమల్లో పనిచేయడానికి యువత సిద్ధండా ఉండేలా తీర్చిదిద్దడమే ప్రభుత్వ సంకల్పం
జీవో ఎంఎస్ నెంబర్: 263 ప్రకారం ప్లానింగ్ డిపార్ట్ మెంట్ అనుమతి ద్వారా పులివెందుల ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ (పిఎడిఎ) కి స్కిల్ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు చేయడానికి శ్రీకారం
ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ ద్వారా డిజైన్లు, డ్రాయింగ్ లు, డిపిఆర్ లు ఏర్పాటు
ఇందుకోసం నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ హాస్టల్ భవనాల సమీపంలో ఉన్న 7 ఎకరాల భూమి స్కిల్ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటుకు గుర్తింపు
స్కిల్ ట్రైనింగ్ అకాడమీలో అత్యాధునిక వసతులు
60వేల చదరపు అడుగుల ప్రాంతంలో అంతర్గతంగా అభివృద్ధితోపాటు ఇప్పటికే రోడ్డు, వైఫై సదుపాయాలు
35వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అకడమిక్ బ్లాక్ తోపాటు 6 తరగతి గదులు, 2 ల్యాబ్స్, ఒక వర్క్ షాపు గదితోపాటు పరిపాలనా భవనం (ప్రిన్సిపల్, స్టాఫ్, ఆఫీస్ రూములు)
ఒక బ్యాచ్ కు 240 మంది విద్యార్థులు శిక్షణ పొందే విధంగా నిర్మాణం
19వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో హాస్టల్ భవనం
హాస్టల్ లో 120 పడకలు (72 బాలురు, 48 మంది బాలికలు) డైనింగ్, లాండ్రీ సదుపాయాలు
ఆడిటోరియం బ్లాక్ 7వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండేలా స్పెషల్ డిజైనింగ్
500 మంది ఒకేసారి పాల్గొనేలా ఆడిటోరియంలో ఉండే సామర్థ్యం
పులివెందులలోని స్కిల్ ట్రైనింగ్ అకాడమీ నిర్మాణాలను 18 నెలల్లో పూర్తి చేసేలా రోడ్లు భవనాల శాఖకు అప్పగింత
నైపుణ్య శిక్షణా అకాడమీ ప్రారంభమైన తరువాత, విద్యార్థులకు అధునాతన ఐటి శిక్షణా కార్యక్రమాలతోపాటు సిమెంట్ పరిశ్రమ, మైనింగ్ పరిశ్రమ వంటి ప్రధాన రంగాలలో నైపుణ్య శిక్షణ
పులివెందులలో ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభమైన స్కిల్ ట్రైనింగ్ అకాడమీ ,
పాల్గొన్న నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి,ఎపిఎస్ఎస్ డిసి చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, ఎపిఎస్ఎస్ డిసి ఎండి బంగార్రాజు
——-
Comments are closed.