దేశంలో కరోనా కట్టడి కోసం చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తెలిపారు. ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అన్నారు.
ఇవాళ మీడియా సమావేశంలో కిమ్ మాట్లాడుతూ, దీనిని షైన్ సక్సెస్ గా చెప్పాలని, అలా అని ఊపిరి పీల్చుకోవడానికి వీలులేదని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలను కరోనా వైరస్ గడగడలాడిస్తోందని, పొరుగు దేశమైన చైనాలో తగ్గుముఖం పట్లి మళ్లీ వ్యాప్తి చెందుతున్నదని అన్నారు. రాలేదు కదా అని నిర్లక్ష్యంగా ఉండకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.
ఎవరైనా సరే ఇతర ప్రాంతాల నుంచి వస్తే 30 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని లేనట్లయితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. వైరస్ నిరోధం కోసం దేశ రాజధానిలో పలు రాయబార కార్యాలయాలను మూసివేసినట్లు ఆయన తెలిపారు. దేశ భద్రత దృష్ట్యా చైనా సరిహద్దును ఇప్పట్లో తెరిచేది లేదని కిమ్ స్పష్టం చేశారు.
అయితే కిమ్ ఆంక్షల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైందని అర్థిక రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో చైనా, ఉత్తర కొరియా మధ్య ఎగుమతులు, దిగుమతులు 90 శాతం పడిపోయాయన్నారు.
Comments are closed.