న్యూఢిల్లీ : దేశంలో న్యాయమూర్తులపై , బెదిరింపులు, దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కీలకమైన నేర విచారణ సంస్థలైన సి.బి.ఐ, ఐబీ న్యాయ వ్యవస్థలకు సహకరించడం లేదని సుప్రీం కోర్ట్ సీ జే ఐ ఎన్.వి.రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా కేసుల్లో గ్యాంగ్ స్టర్ లు, మాఫియా హై సొసైటీ వ్యక్తుల కారణంగా గా ట్రయల్ కోర్టుల నుంచి హైకోర్టు జడ్జి ల వరకు బెదిరింపులు జరుగుతున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. చాలా సందర్భాల్లో స్వయంగా సుప్రీంకోర్టు విచారణకి ఆదేశించిన అత్యున్నత నిఘా సంస్థ అయిన సి.బి.ఐ ఈ సంవత్సరం పాటు కాలయాపన చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. అలానే 2019 న న్యాయమూర్తుల రక్షణపై దాఖలైన పిల్ కి ఇంతవరకు కేంద్రం సమాధానం ఇవ్వలేదని , త్వరగా అఫిడవిట్ దాఖలు చేయలేని పేర్కొంది. అలాగే న్యాయమూర్తుల రక్షణ కొరకు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని రాష్ట్రాలను ఆదేశించింది. ధన్ బాద్ లో న్యాయమూర్తి హత్య, తదుపరి జరిగిన పరిణామాలపై సుమోటోగా కేసు స్వీకరించింది సుప్రీంకోర్టు.
Comments are closed.