The South9
The news is by your side.
after image

చంద్రబాబు కామెంట్లపై జర్నలిస్టు సంఘాల ఆగ్రహం.

*మీడియాను కుక్కలతో పోల్చిన చంద్రబాబు*

 

మూడేళ్లు అధికారానికి దూరం కావడంతో చంద్రబాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. రోజురోజుకు ఆయనలో అసహనం పెరిగిపోతోంది.

*ఇప్పటికే కొన్ని మీడియా సంస్థలను తన కాపాల కుక్కల్లా మార్చుకున్న చంద్రబాబు.. మిగతా మీడియాను కూడా కుక్కల్లా మారాలని పరువు తీశారు.* ఆదివారం హైదరాబాద్ నడిబొడ్డున ఈ కామెంట్లు చేశారు.

 

*ఊర కుక్కల్లా మారాలని అవమానించిన చంద్రబాబు*

Post Inner vinod found

నిన్న జనసేన అధినేత పవన్ తో కలిసి మీడియాతో మాట్లాడిన చంద్రబాబు సహనం కోల్పోయారు. జీఓ1పై ఓ రిపోర్టర్ ప్రశ్నించగా చంద్రబాబు సమాధానం చెప్పకుండా విసుగెత్తిపోయారు. మీడియాను మూకుమ్మడిగా దాడి చేసే కుక్కలతో పోల్చారు. *బ్రిటీష్ పాలనలో కూడా కొందరు ఊడిగం చేశారని చెప్పుకొచ్చిన చంద్రబాబు..ఊర కుక్కల్లా మారాలని మీడియా మొత్తాన్ని అవమానించారు.*

 

*చంద్రబాబు కామెంట్లపై జర్నలిస్టు సంఘాల ఆగ్రహం*

Post midle

జర్నలిస్టులు అటూ-ఇటూ తాళాలు వేస్తున్నారని అమర్యాదగా మాట్లాడారు. నిజంగానే జర్నలిస్టులకు దమ్ముంటే..ముందు వైఎస్ఆర్సీపీపై వ్యతిరేక కథనాలు రాసి తమను ప్రశ్నించాలని ఆర్డర్ వేశారు. *చంద్రబాబు కామెంట్లపై జర్నలిస్ట్ సంఘాలు మండిపడుతున్నారు. 40ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబుకు మీడియాతో ఎలా మాట్లాడాలో తెలియదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.*

Post midle

Comments are closed.